దక్కన్ సిమెంట్స్ అటవీ భూముల ఆక్రమణపై విచారణకు సుప్రీంకోర్టు పరిధిలోని C.E.C ఆదేశాలు

సూర్యాపేట:– వందల ఎకరాలలో అటవీ భూములు ఆక్రమణలు చేసి, అక్రమ నిర్మాణాలకు పాల్పడిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలోని దక్కన్ సిమెంట్ యాజమాన్యంపై, మరియు సంబంధిత అధికారులపై విచారణకు దేశ సర్వోన్నత న్యాయస్థానంచే నియమించబడిన C.E.C ఆదేశాలు జారీ చేసింది. 

దక్కన్ ఆటవీభూమి ఆక్రమణ, చట్టవ్యతిరేకమైన క్రమబద్ధీకరణ విచారణకు సుప్రీంకోర్టు పరిధిలోని C.E.C ఆదేశాలు.

 

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, పర్యావరణశాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసిన సెంట్రల్ ఏంపవరడ్ కమిటీ .

 

అటవీ భూమిలో దక్కన్ సిమెంట్స్ ఆక్రమణలు వాటి చట్టవ్యతిరేక క్రమబద్ధికరణలపై పసుపులేటి సురేష్ ఫిర్యాదు.

 

విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థాన పరిధిలోని సెంటర్ ఎంపవరెడ్ కమిటీ.

 

ఈ నెల 25వ తేదీన సీఈసీ ముందు విచారణ.

  1. సూర్యాపేట:– వందల ఎకరాలలో అటవీ భూములు ఆక్రమణలు చేసి, అక్రమ నిర్మాణాలకు పాల్పడిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలోని దక్కన్ సిమెంట్ యాజమాన్యంపై, మరియు సంబంధిత అధికారులపై విచారణకు దేశ సర్వోన్నత న్యాయస్థానంచే నియమించబడిన C.E.C ఆదేశాలు జారీ చేసింది.

సదరు సుప్రీంకోర్టుచే ఏర్పాటు చేయబడిన సెంట్రల్ ఎంపవరడ్ కమిటీ ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, పర్యావరణశాఖ కార్యదర్శులకు ఈనెల 25న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

ఇటీవల పసుపులేటి సురేష్ సూర్యాపేట జిల్లా , పాలకవీడు మండల పరిధిలోని సైదుల్ నామ రిసెర్వెడ్ ఫారెస్ట్ అటవీ భూమిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంలోని

సంబంధిత అధికారులకు ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేశారు.

 

ఈ విషయమై గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో, సంబంధిత మంత్రిత్వశాఖలో తీవ్రమైన దుమారమే రేగింది.

 

అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐనటువంటి C.V.C సెంట్రల్ విజిలన్స్ కమిషన్, CPGRAMS పోర్టల్ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం అట్టి ఫిర్యాదును సమర్పించగా,

M.O.E.F & Cc కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు తదుపరి విచారణ నిమిత్తం పంపగా అట్టిఫిర్యాదుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించి తగిన చర్యలు తీసుకోవాలసినదిగా కేంద్ర ప్రభుత్వశాఖ పలుమార్లు సూచించడం జరిగింది.

జరుగుతున్న విషయాలను, అక్రమాలను 06.12.2025 న భారతదేశ సర్వోన్నత న్యాయస్థాన పరిధిలోని C.E.Cకి కూడా ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదును పరిశీలించిన తదుపరి సదరు C.E.C సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివరణ కోరుతూ వారం రోజులలోగా సమాధానం పంపవసినదిగా తేదీ: 22.12.2025న సూచించింది.

ఐతే ఇప్పటివరకు ఎటువంటి ప్రతిస్పందన రాష్ట్ర ప్రభుత్వం నుండి లేకపోవడంతో మరొకమారు ఫిర్యాదుదారుడు గౌరవ కమిటీకి వివరించడంతో సర్వోన్నత న్యాయస్థాన పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వద్ద విచారణకు ఈనెల 25వ తారీకున హాజరు కావలసినదిగా తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శులకు నోటీసులు జారీచేసి ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button