రిజిస్ట్రేషన్ లేని క్లినిక్లపై కఠిన చర్యలు: జిల్లా వైద్యారోగ్య శాఖ హెచ్చరిక..!
జిల్లాలో వైద్య సంస్థలన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే: DMHO డాక్టర్ వెంకటరమణ..!
సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్య సేవా సంస్థలు తక్షణమే జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీలో నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ ఆదేశించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-2010 ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఎక్స్-రే మరియు స్కానింగ్ సెంటర్లు.ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యాచురపతి మరియు ఫిజియోథెరపీ క్లినిక్లు కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు అందించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు అతిక్రమించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని DMHO హెచ్చరించారు.



