సార్ చెప్పింది మీరేనా అయితే ఓకే…డబ్బులు కొట్టు పర్మిషన్ పట్టు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి ముజాహిద్‌పురం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా దందా బహిరంగంగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి, సమీప బీడు భూముల్లో భారీగా డంపింగ్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇసుక మాఫియాకు అధికార నాయకుడి అండ?.

పాలేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా..

బీడు భూముల్లో భారీగా డంపింగ్

రాత్రి పగలు తేడా లేకుండా రవాణా…!

చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

తిరుమలాయపాలెం, మార్చి 25 నిజం చెపుతాం న్యూస్,,

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి ముజాహిద్‌పురం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా దందా బహిరంగంగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి, సమీప బీడు భూముల్లో భారీగా డంపింగ్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

 

“సారు చెప్పింది మీరేనా అయితే ఓకే… డబ్బు కొట్టు, పర్మిషన్ నేను తెస్తా” అంటూ ఓ అధికారి, స్థానిక నాయకుడు ఇసుక మాఫియా ఓనర్లకు భరోసా ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాలేరు వాగు పరిసరాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, తిరుగుతున్నాయని, ఎప్పుడైనా ఇసుక లోడింగ్ జరుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలుగుతోందని, పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా తీసుకువచ్చిన ఇసుకను బీడు భూముల్లో నిల్వ చేసి,

తరువాత భారీగా విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనికి స్థానికంగా ఉన్న కొందరు ప్రభావశీలులు అండగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button