షాపింగ్ కాంప్లెక్స్‌లో పాఠశాల.. గ్రౌండ్ లేని భవనం-విద్యాశాఖ నిబంధనలు గాలికి..!

షాపింగ్ కాంప్లెక్స్‌లో స్కూల్: మెయిన్ రోడ్డుపై ఉన్న ఒక వాణిజ్య సముదాయంలో, కింద షాపింగ్ సెంటర్లు నిర్వహిస్తూ పైన స్కూల్ నడపడం విద్యార్థుల భద్రతకు ముప్పు. అగ్నిప్రమాదం వంటివి జరిగితే బాధ్యత ఎవరిది?

రవీంద్ర భారతి స్కూల్ అరాచకాలను అరికట్టాలి

 

ఆర్టీఐ.ఎస్.ఎస్ అధినేత కె. బాబు రామ్ నాయక్ గర్జన

 

ఫేర్‌వెల్ పార్టీ పేరిట అక్రమ వసూళ్లు: 9వ తరగతికి రూ. 1,500.

10వ తరగతికి రూ. 600

 

డబ్బుల కోసం విద్యార్థులను గంటల తరబడి నిలబెట్టడం అమానుషం – ఆర్టీఐ.ఎస్.ఎస్ తీవ్ర ఖండన.

 

షాపింగ్ కాంప్లెక్స్‌లో స్కూల్.. గ్రౌండ్ లేని భవనం-విద్యాశాఖ నిబంధనలు గాలికి..

 

డిండి మార్చి 07, నిజంచెపుతాం:

 

దేవరకొండ పట్టణంలోని రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ ప్రవర్తిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమైనదని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్టీఐ.ఎస్.ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు కె. బాబు రామ్ నాయక్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

శనివారం ఆయన మాట్లాడుతూ, విద్యా బుద్ధులు నేర్పాల్సిన చోట వ్యాపార ధోరణితో విద్యార్థులను వేధించడంపై నిప్పులు చెరిగారు.

1. ఫేర్‌వెల్ పార్టీ పేరిట ‘వసూళ్ల’ పర్వం:

పాఠశాలలో వీడ్కోలు వేడుక (ఫారెవెల్ పార్టీ) పేరుతో విద్యార్థుల నుండి భారీగా డబ్బులు గుంజుతున్నారని బాబు రామ్ నాయక్ మండిపడ్డారు.

9వ తరగతి విద్యార్థుల నుండి రూ. 1,500

10వ తరగతి విద్యార్థుల నుండి రూ. 600

బలవంతంగా వసూలు చేయడం దోపిడీకి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. “మా దగ్గర అంత డబ్బు లేదు” అని మొరపెట్టుకున్న విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు సభ్యత లేకుండా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2. చిన్నారులపై మానసిక దాడి – విద్యాహక్కు చట్టం ఉల్లంఘన:

డబ్బులు కట్టలేదనే నెపంతో విద్యార్థులను రెండు గంటల పాటు ఆఫీస్ రూమ్ ముందు నిలబెట్టి శిక్షించడం విచారకరమన్నారు. “మీ తల్లిదండ్రులు ఇస్తారు, మీరే ఇవ్వడం లేదు” అంటూ చిన్నారులను మానసిక వేదనకు గురిచేయడం విద్యాహక్కు చట్టం (ఆర్ టి ఐ) సెక్షన్ 17 కు వ్యతిరేకమని పేర్కొన్నారు.

పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థులను ఇలాంటి ఒత్తిడికి గురిచేయడం వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని ఆయన హెచ్చరించారు.

3. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ:

అక్రమ వసూళ్లతో పాటు, ఈ పాఠశాల భవన నిర్మాణం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని బాబు రామ్ నాయక్ ఎండగట్టారు.

షాపింగ్ కాంప్లెక్స్‌లో స్కూల్: మెయిన్ రోడ్డుపై ఉన్న ఒక వాణిజ్య సముదాయంలో, కింద షాపింగ్ సెంటర్లు నిర్వహిస్తూ పైన స్కూల్ నడపడం విద్యార్థుల భద్రతకు ముప్పు. అగ్నిప్రమాదం వంటివి జరిగితే బాధ్యత ఎవరిది?

ఆటస్థలం (గ్రౌండ్) లేమి: కనీసం ఆడుకోవడానికి ఆటస్థలం కూడా లేని ఇలాంటి స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు ఏ ప్రాతిపదికన గుర్తింపు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

మౌలిక వసతుల లేమి: భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం త్రాగునీటి సౌకర్యం లేదని, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు.

ఆర్టీఐ.ఎస్.ఎస్

ప్రధాన డిమాండ్లు:క్రిమినల్ చర్యలు: విద్యార్థులను దూషించి, మానసిక వేదనకు గురిచేసిన ప్రిన్సిపాల్ మరియు సంబంధిత సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

గుర్తింపు రద్దు: గ్రౌండ్ లేకుండా, కమర్షియల్ కాంప్లెక్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్దు చేయాలి.

రహస్య విచారణ: విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచి, అధికారులు తక్షణమే పాఠశాలను తనిఖీ చేసి బాధితులకు న్యాయం చేయాలి.”ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చుకుంటే చూస్తూ ఊరుకోం. విద్యార్థులను వేధించే సంస్కృతిని దేవరకొండలో సహించబోం. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి, లేనిపక్షంలో సమాచార హక్కు సేవా సొసైటీ ( ఆర్టీఐ.ఎస్.ఎస్ ) ఆధ్వర్యంలో బాధితులకు అండగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని బాబు రామ్ నాయక్ హెచ్చరించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button