పాఠశాలలో దారుణం: విద్యార్థినిపై మాస్టర్ అత్యాచారం… వీడియో తీసి మరో మాస్టర్ బ్లాక్మెయిల్ —ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
మద్దూరు మండలం మోమినాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చండేపల్లి స్వామి, అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్వామితో వ్యక్తిగత విభేదాలున్న మరో ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డి, వీరిద్దరూ కంప్యూటర్ గదిలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను రహస్యంగా కెమెరాతో చిత్రీకరించాడు.

విద్య, బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దారుణానికి పాల్పడిన సంఘటన నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
10 వ తరగతి విద్యార్థిని లోబర్చుకున్న ఓ ఉపాధ్యాయుడు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, మరో ఉపాధ్యాయుడు ఆ సంఘటనను రహస్యంగా వీడియో తీసి బ్లాక్మెయిల్కు యత్నించడం, స్తానిక సర్పంచ్ భర్తకు పంపడంతో వారు డబ్బుల కోసం డిమాండ్ చేయడం వారి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఈ కేసులో ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ భర్తతో సహా మొత్తం 7 గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
మద్దూరు మండలం మోమినాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చండేపల్లి స్వామి, అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్వామితో వ్యక్తిగత విభేదాలున్న మరో ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డి, వీరిద్దరూ కంప్యూటర్ గదిలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను రహస్యంగా కెమెరాతో చిత్రీకరించాడు.
అనంతరం గురునాథ్ రెడ్డి ఈ వీడియోను స్థానిక సర్పంచ్ భర్త గూళ్ల రవికి పంపాడు. రవి తన అనుచరులతో కలిసి ఉపాధ్యాయుడు స్వామిని, గురునాథ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు డబ్బు కోసం బెదిరించాడు. ఒప్పందం కుదరకపోవడంతో నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మార్చి 26న ఈ వీడియో వైరల్ కావడంతో విషయం బయటపడింది.
ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ జరిపి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాలికపై స్వామి అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు. నేరంలో భాగమైన స్వామి, గురునాథ్ రెడ్డి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ మాస్టర్ చెన్నకేశవులు, బ్లాక్మెయిల్కు పాల్పడిన సర్పంచ్ భర్త గూళ్ల రవితో పాటు అతని ముగ్గురు అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి వారి నుంచి మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.