మరణించినా జీతాలు డ్రా….! పోలీసు విభాగంలో విచిత్రం
ముగ్గురు కానిస్టేబళ్లుకు సంబంధించిన ఐడీలతో నాలుగేళ్లుగా వేతనాలు డ్రా అవుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నదే మిస్టరీగా మారిపోయింది.

హైదరాబాద్, ఏప్రిల్ 11, నిజం న్యూస్
కమిషనరేట్ పోలీస్ ఆఫీస్ (CPO) నుండే పోలీసు యంత్రాంగం వేతనాలు, ఇంక్రి మెంట్లు, టీఏలు, డీఏల, పనిష్మెంట్ కు గురైన వారి వేతనాల్లో కోత ఇలా ప్రతి అంశానికి సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లు కదులుతుంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తుంటారు…!
మరణించిన వారి వివరాలు, బదిలీ అయిన వారి వివరాలు వారి ఐడీ నెంబర్లు ఇలా ప్రతి అంశంపై సవివరంగా ఫైళ్లు తయారు చేసి అందుకు అనుగుణంగా జీత భత్యాలకు సంబంధించిన బిల్లులు సిద్ధం చేస్తారు.
అయితే CPO ఆఫీసులో కంప్యూటర్ సిస్టం ఆపరేటింగ్ చేసిన హెడ్ కానిస్టేబులు ఒంటి చేత్తో అన్ని వ్యవహారాలు చక్కదిద్దేవాడన్న ప్రచారం జరుగుతోంది.
అటాచ్ మెంట్ పై వచ్చిన ఈయన 25 నుండి 30 ఏళ్లుగా సీపీఓలో రాజ్యం ఏలుతున్నాడని అతనికే కీలకమైన బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది…!
అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకునేంత స్వేచ్ఛ లభించిందన్న చర్చ స్థానికంగా సాగుతోంది. మరో వైపున ఆర్థిక వ్యవహారాల విషయం లోCPO కార్యాలయంలో “B” “P” సెక్షన్లు కీలకంగా పని చేయాల్సి ఉంటుంది.
బడ్జెట్ కెటాయింపుల వ్యవహారాలు చూసే “B” సెక్షన్, జీత భత్యాలు అందించేందుకు పేమెంట్ “P” సెక్షన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే పోలీసు విభాగంలో మరణించిన పోలీసు అధికారే అయినా సిబ్బంది అయినా సీపీఓ కార్యాలయం నుండే ఫైళ్లు కదులుతుంటాయి…
ఎప్పటికప్పుడు ఈ వివరాలను అప్ డేట్ చేసుకున్న తరువాత వేతనాలకు సంబంధించిన బిల్లులు సంబంధిత సెక్షన్ ఉద్యోగుల చేతుల మీదుగా సాగుతుంటాయి…!
అయితే ఇక్కడ ట్విస్ట్ … ముగ్గురు కానిస్టేబళ్లుకు సంబంధించిన ఐడీలతో నాలుగేళ్లుగా వేతనాలు డ్రా అవుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నదే మిస్టరీగా మారిపోయింది.
AOతో పాటు సెక్షన్ సూపరింటిండెంట్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు కూడా ఫైళ్లను పరిశీలించి సంతకాలు చేస్తుంటారు.
వీరంతా మరణించిన కానిస్టేబుళ్ల పేరిట వేతనాలు డ్రా అవుతున్నాయన్న విషయం గురించి గుర్తించకపోవడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది…!
పోలీసు సిబ్బంది చనిపోయిన విషయం గురించి కార్యాలయానికి సమాచారం వచ్చిన తరువాత చనిపోయిన విషయం గురించి సీపీఓ కార్యాలయానికి సమాచారం వచ్చిన తరువాత వారి ఐడీలను బ్లాకులో పెట్టి, నామినీల పేరిట బెనిఫిట్స్, వేతనాలు, పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
మరణించిన పోలీసు యంత్రాంగానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా సీపీ లేదా ఎస్పీల చేతుల మీదుగానే వారి కుటుంబాలకు ఇచ్చే సాంప్రాదాయం కొనసాగుతోంది.
అయితే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ముగ్గురు కానిస్టేబుళ్లు మరణించిన విషయం ఉన్నతాధికారికి తెలిసినా కూడా CPO యంత్రాంగం దర్జాగా వేతనాలు డ్రా చేసుకునేంత సాహసం చేయడం ఏంటన్నదే మిస్టరీగా మారింది.



