రాబరీ కేసు ఛేదన, నలుగురు నిందితుల అరెస్ట్, రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించి న రాబరీ కేసును పోలీసులు ఛే దించారు. నల్లగొండ జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీసుల సంయుక్త చర్యలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.13.35 లక్షల విలువైన బం గా రం, వెండి, వాహనాలు, ఇతర వ స్తువులను స్వాధీనం చేసుకున్నా రు.

సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించి న రాబరీ కేసును పోలీసులు ఛే దించారు. నల్లగొండ జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీసుల సంయుక్త చర్యలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.13.35 లక్షల విలువైన బం గా రం, వెండి, వాహనాలు, ఇతర వ స్తువులను స్వాధీనం చేసుకున్నా రు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పోలీస్ కార్యాల యంలో నిర్వహించిన మీడియా స మావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.

ఈ కేసులో కంచుకొమ్ముల సంతో ష్, కంచు కొమ్ముల గణేష్, షేక్ నశ్రీ న్, కంచు కొమ్ముల సాయికిరణ్ క లిసి ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు
పాల్పడుతున్నారు. ముందుగా ఆ టోలను దొంగిలించడం, దొంగిలిం చిన ఆటోలలో తిరుగుతూ ఒంట రిగా ప్రయాణించే వృద్ధ మహిళల ను లక్ష్యంగా చేసుకోవడం, వారిని బెదిరించి ఆభరణాలు దోచుకోవ డం ఆ క్రమంలో అదే ఆటోలతో రా త్రి వేళతాళాలు వేసిన ఇళ్లలో దొం గతనాలు చేయడం పరిపాటిగా పెట్టుకున్నారు.
*కోటినాయక్ తండాలో వృద్ధు రాలిపై రాబరీ*
ఈ నెల 6వ తేదీన ఆత్మకూరు మండలం కోటి నాయక్ తండ స మీపంలో ఒక వృద్ధురాలిని ఆటో లో ఎక్కించుకుని కొంత దూరం తీ సుకెళ్లారు. అక్కడ ఆమెను చంపు తామని బెదిరించి నోరు మూసి, ఆ మె మెడలో ఉన్నవెండి గొలుసును దోచుకొని పారిపోయారు.
ఈ ఘట నపై బాధితులు మార్చి 10న ఆత్మ కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రాబరీ కేసు నమోదు చే శారు. దర్యాప్తులో భాగంగా జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పో లీసులు టెక్నాలజీ సహాయంతో నిందితుల కదలికలను గమనించా రు.
ఈ రోజు ఉదయం 6 గంటల స మ యంలోఆత్మకూరు మండలం ఎను బాముల గ్రామ స్టేజీ వద్ద పోలీసు లు తనిఖీలు నిర్వహిస్తుండగా TS 29 T 1190 ఆటోలో నిమ్మికల్ వై పు వెళ్తున్న నలుగురిని అనుమా నంతో ఆపి తనిఖీ చేశారు. అప్పు డు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా కంచుకొమ్ముల సంతోష్,కంచుకొమ్ముల గణేష్,
షేక్ నశ్రీన్, కంచుకొమ్ముల సా యి కిరణ్ లుగా గుర్తించారు. విచార ణలో వీరుమునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, తిప్పర్తి, పిడు గురాళ్ల, మేళ్లచెరువు, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధు ల్లో బంగారం, వెండి, ఆటోలు, బైకు లు, సెల్ ఫోన్లు దొంగతనం చేసిన ట్లు అంగీకరించారు.
*స్వాధీనం చేసుకున్న వస్తువులు*
పోలీసులు నిందితుల వద్ద నుండి మొత్తం రూ.13.35 లక్షల విలు వై న వస్తువులు స్వాధీనం చేసుకు న్నారు.రూ.3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, రూ.5 లక్షల విలువైన 1.5 కేజీల వెండి, రూ.4 లక్షల విలువైన,3ఆటోలు ట్యాబ్, ల్యాప్టాప్,రూ.30 వేల విలువైన 1 బైక్, రూ.25 వేల విలువైన 1టీ వీ రూ.30 వేల విలువైన 3 సెల్ ఫో న్లు స్వాధీన పరచుకున్నారు.
నిందితుల మధ్య సంబంధాలకు సంబంధించి ఎస్పీ తెలిపిన వివ రాల ప్రకారం A1 సంతోష్ మరి యు A4 సాయికిరణ్, అన్న ద మ్ములు కాగా A2 గణేష్ వీరి బా బాయి కొడుకు కావడం విశేషం.
ఇక A3 షేక్ నశ్రీన్ A1 సంతోష్ భా ర్య ఈ కేసులో A5గా షేక్ నశ్రీన్ త మ్ముడు కాగా ఇతను బాల నేరస్థు డిగా ఉన్నట్లు పోలీసులు తెలిపా రు.
*నిందితుల గత నేర చరిత్ర*
కేసులో అరెస్టైన నిందితులు A1 సంతోష్ పై కోదాడ టౌన్, కోదాడ రూరల్, వేములపల్లి, నిడమనూ రు, ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేష న్లలో 9 కేసులు ఉన్నాయి. A2 గణేష్ పై కోదాడ టౌన్లో 2 కే సు లు, నిడమనూర్లో 1 కేసు ఉంది.
A4 సాయికిరణ్ పై కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నా యి.
ఈ కేసును విజయవంతంగా ఛేదిం చిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమా ర్, సూర్యాపేట రూరల్ సీఐ రాజ శే ఖర్, ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్, సీ సీఎస్ ఎస్సై హరికృష్ణ, టెక్నికల్ టీం ఆర్ఎస్ఐ రాజశేఖర్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందిం చారు. ఈ మీడియా సమావేశంలో సీసీఎస్, ఆత్మకూరు పోలీస్ అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.



