పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి … ఐదుగురు అరెస్ట్

హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని రామస్వామి గుట్ట ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బండి మోహన్ వెల్లడించారు.

రామస్వామి గుట్ట వద్ద పేకాట స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్.!

 

హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని రామస్వామి గుట్ట ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బండి మోహన్ వెల్లడించారు.

నమ్మదగిన సమాచారం మేరకు రామస్వామి గుట్ట పరిసరాల్లో తనిఖీలు చేపట్టగా, కొందరు వ్యక్తులు గుంపుగా చేరి జూదం ఆడుతూ కనిపించారు. వెంటనే వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు.

నిందితుల నుండి 12,000 రూపాయల నగదు, 3 స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్సై బండి మోహన్ మాట్లాడుతూ.. పట్టణంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జూదం వంటి వ్యసనాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని, ప్రజలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button