ఫోన్ పే చేస్కో …ఇసుక వేసుకో
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్వహించబడుతున్న బ్రాహ్మణపల్లి2, ఇసుక క్వారీ కాంట్రాక్టర్, అక్రమ వసూళ్లకు ఎవరి కళ్ళకు చిక్కకుండా, దర్జాగా లారీ డ్రైవర్ల నుండి "ఫోన్ పే" ద్వారా లోడింగ్ చార్జి పేరుతో 1700 వందల రూపాలు, వసూలు చేయడం కాంట్రాక్టర్ సదురు గుమస్తా కొండం అజిత్ రెడ్డి, అకౌంట్ కు 1700 రూపాయలు ఫోన్ పే ద్వారా అందించి, ఇసుక లారీలు లోడ్ చేసుకోవడం జరుగుతుంది.

బ్రాహ్మణపల్లి,2 అక్రమ వసూళ్లు జోరు.*
1700 రూ.లు లోడింగ్ పేరుతో అక్రమ వసూళ్లు.
18 రోజుల్లో, 1487 లారీల ఇసుక రవాణా, 25 లక్షల పైచిలుకు అక్రమ వసూళ్లు.
టీజీఎండిసి సిబ్బంది కీలుబొమ్మలు, అంతా కంటైనర్ వద్ద పరిమితం.
అక్రమ వసూళ్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు, డోంట్ కేర్.
ఎండి మరియు, ప్రిన్సిపల్ సెక్రటరీ తక్షణమే చర్యలు తీసుకోవాలి.
మహాదేవపూర్, జనవరి 23 (నిజం న్యూస్)
ఇసుక క్వారీ అంటేనే అదనపు వసూళ్ల తో లక్షల రూపాయల అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్ గా మారడం జరిగింది.
పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్ల ఇసుక క్వారీల కు మాత్రం, టీజీఎండిసి శాఖ ఒక కీలుబొమ్మల మారింది, ఉన్నత అధికారుల ఆదేశాలు పాటించకుండా పరోక్షంగా కాంట్రాక్టర్ కు వసూళ్ల పర్వాన్ని అందిస్తున్న టీజీఎండిసి, ఉన్నత అధికారి ఆదేశాలను లెక్కచేయకుండా, కేవలం అక్రమ వసూళ్లే తమ ప్రధాన లక్ష్యంగా, ప్రోత్సహించడం బ్రాహ్మణపల్లి 2, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీలో, లక్షల రూపాయల అదనపు వసూళ్లు అందించడం జరుగుతుంది.
అనడానికి డ్రైవర్ల నుండి కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఫోన్ పే ద్వారా లోడింగ్ చార్జి పేరుతో వసూళ్లు చేసుకోవడం, ప్రస్తుతం బ్రాహ్మణపల్లి టు ఇసుక క్వారీ అక్రమాల వ్యవహారం తెరపైకి రావడంతో, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలు నడవడం లేదు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఫోన్ పే” చేస్కో ఇసుక తీసుకుని పో

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్వహించబడుతున్న బ్రాహ్మణపల్లి2, ఇసుక క్వారీ కాంట్రాక్టర్, అక్రమ వసూళ్లకు ఎవరి కళ్ళకు చిక్కకుండా, దర్జాగా లారీ డ్రైవర్ల నుండి “ఫోన్ పే” ద్వారా లోడింగ్ చార్జి పేరుతో 1700 వందల రూపాలు, వసూలు చేయడం కాంట్రాక్టర్ సదురు గుమస్తా కొండం అజిత్ రెడ్డి, అకౌంట్ కు 1700 రూపాయలు ఫోన్ పే ద్వారా అందించి, ఇసుక లారీలు లోడ్ చేసుకోవడం జరుగుతుంది.
సోమవారం రోజు పలు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ, తమ వద్ద నుండి అక్రమ వసూళ్లు చేయడం జరిగిందని, కొందరు డ్రైవర్లు “ఫోన్ పే” ద్వారా లోడింగ్ చార్జి డబ్బు అందించిన ఆధారాలు “నిజం న్యూస్” కు అందించి, అక్రమ వసూళ్లతో తమకు విముక్తి కల్పించాలని కోరడం విశేషం.

బ్రాహ్మణపల్లి,2 అక్రమ వసూళ్లు జోరు
బ్రాహ్మణ పెళ్లి 2,పేరుతో ఇసుక క్వారీ కాంట్రాక్టర్ యదేచ్చగా అక్రమ వసూళ్లను, తమ సూపర్వైజర్లను ఏర్పాటు చేసి, లారీల వద్ద 1500, లోడింగ్ మరోవైపు 200 పుక్లైన్ ఆపరేటర్ డీజిల్ ఛార్జ్ కొరకు, మొత్తం 1700 రూపాయలు, అదనంగా దర్జాగా వసూళ్లకు పాల్పడుతుంటే, అక్రమ వసూళ్లకు చెక్ పెట్టి, చర్యలు తీసుకుంటున్న క్రమంలో, జల వనరుల శాఖ ఆదేశాలకు బ్రాహ్మణపల్లి 2, కాంట్రాక్టర్ మాత్రం, ఆదేశాలు “డోట్ కేర్ అంటూ” వసూళ్ల పరంపర కొనసాగించడం, జరుగుతుంది .
ఈ ఇసుక క్వారీ ప్రారంభం నుండి ఎన్ని లక్షల రూపాయలు లారీల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది.
18 రోజుల్లో, 1487 లారీల ఇసుక రవాణా, 25 లక్షల పైచిలుకు అక్రమ వసూళ్లు.
బ్రాహ్మణపల్లి రెండు పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ ఈనెల 5వ తేదీ నుండి ప్రారంభం అయి ఇప్పటికి 18 రోజులు, పెద్ద మొత్తంలో లారీల రవాణా తో పాటు అక్రమ వసూళ్లకు తరలిపోయింది. ఈ ఇసుక క్వారీ 18 రోజుల్లో 1487, లారీల్లో ఇసుక రవాణా చేసి తరలించింది,
అదే క్రమంలో ప్రతి లారీ నుండి 1700 రూపాయల చొప్పున ఇప్పటివరకు 25 లక్షల పైచిలుకు, రూపాలను లోడింగ్ పేరుతో సొమ్ము చేసుకోవడం జరిగింది. ఇంత దర్జాగా లారీ డ్రైవర్ మరియు ఓనర్ల నుండి, ముక్కు పిండి మరీ లోడింగ్ పేరుతో వసూలు చేస్తుంటే, టీజీఎండిసి అధికారులు సిబ్బంది, ఎందుకు తెలవకుండా వ్యవహరిస్తున్నారు అనేది ప్రశ్న.
టీజీఎండిసి సిబ్బంది కీలుబొమ్మలు, అంతా కంటైనర్ వద్ద పరిమితం.
బ్రాహ్మణ పెళ్లి రెండు పేరుతో లక్షల రూపాలు లోడింగ్ చార్జీలతో అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్న ఇసుక క్వారీ కాంట్రాక్టర్, మరియు గుమస్తాలపై, అక్కడ ఉన్నటువంటి శాఖ సిబ్బంది అధికారి, పర్యవేక్షించకుండా, కేవలం కంటైనర్ వద్ద కె, పరిమితమై లోడింగ్ వద్ద కాంట్రాక్టర్, కుర్చీ వేసుకుని మరీ లారీ డ్రైవర్ల నుండి 1700 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తుంటే, లోడింగ్ పైట్ వద్ద ఉండాల్సిన టీజీఎండిసి సిబ్బంది మరియు సూపర్వైజర్, కంటైనర్ లో ఉండి, కాంట్రాక్టర్ సూపర్వైజర్ కు నగదు వసూళ్లతో పాటు ఫోన్ పే, లు లోడింగ్ చార్జీలు తీసుకునుటకు పరోక్షంగా సహకరించడం జరుగుతుంది.
అని స్పష్టంగా, అర్థమవ్వడమే కాకుండా ఫోన్ పే ద్వారా డ్రైవర్లు అందిస్తున్న లోడింగ్ చార్జి సాక్ష్యం.
అక్రమ వసూళ్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు, డోంట్ కేర్.
గత సంవత్సరం అక్రమ వసూళ్లపై, కురుడా కురిపించిన జల వనరుల శాఖ, ఆదేశాలు కొద్ది రోజులు అమలుకు నోచుకోవడంతో, అదనపు వసూళ్ల పర్వం సమాప్తం కావడంతో లారీ అసోసియేషన్ ఆనందించింది. కానీ కాంట్రాక్టర్ల టీజీఎండిసి లో ఉన్న పలుకుబడి, అక్రమ వసూళ్లకు జల వనరుల శాఖ ఆదేశాలకు తొక్కిపడేసిందని చెప్పడానికి, బ్రాహ్మణపల్లి2, లో ఫోన్ పే ద్వారా లోడింగ్ పేరుతో వసూళ్ల పర్వమే సాక్ష్యం.
ఈ క్వారీలో టీజీఎండిసి నిబంధనలు అలాగే జల వనరుల శాఖ ఆదేశాలు డోంట్ కేర్ అంటున్నాడు కాంట్రాక్టర్, అక్రమ వసూళ్లతో లారీ డ్రైవర్లు ముగ్గు చూపకపోవడం, ఇసుక రవాణా తగ్గించేలా చేస్తుందని గతంలో లారీ అసోసియేషన్, అక్రమ వసూళ్లు తమకు ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే,
ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బ్రాహ్మణపల్లి 2, ఇసుక క్వారీ వ్యవహారం ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా చేస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ జల వనరుల శాఖ, తక్షణమే పీజీఎండిసి ఉన్నత అధికారులకు ఆదేశించి బ్రాహ్మణపల్లి 2, ఇసుక క్వారీ ఇసుక రవాణా చేయకుండా బ్లాక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.



