వందే భారత్ ఆహారంలో పురుగు సంస్థ లైసెన్స్‌ రద్దు..?

క్యాటరింగ్ సంస్థకు రూ. 10 లక్షల భారీ జరిమానా..!

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆహార నాణ్యతపై ఫిర్యాదు రావడంతో రైల్వే శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు అందించిన ఆహారంలో పురుగు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), సంబంధిత ఆహార తయారీ సంస్థపై రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది.

ఇటీవల ఒక వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తికి అందించిన మీల్స్‌లో పురుగు కనిపించింది. సదరు ప్రయాణికుడు వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రైల్వే శాఖను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పాటు ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రైల్వే బోర్డు తక్షణ విచారణకు ఆదేశించింది.

విచారణలో క్యాటరింగ్ సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో, నిబంధనల ప్రకారం రూ. 10 లక్షల పెనాల్టీ విధించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సదరు సంస్థ లైసెన్స్‌ను రద్దు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ఆహారం ప్యాక్ చేసే ప్రాంతాల్లో సిసిటివి కెమెరాల నిఘా పెంచాలని, అకస్మాత్తుగా నాణ్యత తనిఖీలు చేపట్టాలని ఐఆర్‌సిటిసి నిర్ణయించింది.

ప్రయాణికుల ఆరోగ్యం మరియు భద్రత మాకు అత్యంత ముఖ్యం. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. తప్పు చేసిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button