ఇర్విన్ లో భూములున్నోళ్ళు జర భద్రం
2016 సంవత్సరం తర్వాత రాజారాంకరణ్ పేరు మీద ఉన్న భూమి క్రమక్రమంగా మేమే రాజారాంకరన్ కు సంబంధించిన వారసులం అంటూ అందుగుల కుటుంబీకులుగా చెప్పుకునే వారు అప్పనంగా 11:20 గుంటల భూమిని అప్పటి లో అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అందుగుల కుటుంబీకుల పేరుమీద నమోదు చేయించుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఖాళీ వ్యవసాయ భూమి కనిపిస్తే ఖతం..
మాడ్గుల ఫిబ్రవరి 16(నిజం చెపుతాం): మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 1152 లో 1954 సంవత్సరం నుండి 2016 వరకు రాజారాంకరణ్ పేరు మీద 14 ఎకరాల వ్యవసాయ భూమి నమోదయి ఉన్నది.
అక్కడ ఏమి జరిగిందో తెలియదు గానీ 2016 సంవత్సరం తర్వాత రాజారాంకరణ్ పేరు మీద ఉన్న భూమి క్రమక్రమంగా మేమే రాజారాంకరన్ కు సంబంధించిన వారసులం అంటూ అందుగుల కుటుంబీకులుగా చెప్పుకునే వారు అప్పనంగా 11:20 గుంటల భూమిని అప్పటి లో అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అందుగుల కుటుంబీకుల పేరుమీద నమోదు చేయించుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ భూమి మాదే అంటూ అందుగుల కుటుంబీకులు చలామణి అవుతూ ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఇర్విన్ గ్రామానికి చెందిన కొంతమందికి గతంలో అక్రమంగా అందుగుల వారసులు పట్టా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగానే క్రమక్రమంగా రాజారాంకరణ్ పేరు మీద ఉన్న భూమిని అందుగుల వారసులు కాజేశారు.
ప్రస్తుతం రికార్డు పరంగా సర్వే నెంబర్ 1152/4 లో 2:20 భూమి రాజారామ్ కరణ్ పేరుమీద రికార్డులో నమోదయి ఉన్నది.

ఈ భూమి గత కొన్ని యేండ్లుగా నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన గంగిరెద్దులను ఆడించేవారు సాగు చేసుకుని జీవనోపాధి పొందేవారని ఆ భూమికి సమీప గ్రామమైన అజిలాపూర్ గ్రామస్తులు చెప్పారు.
ఇది అదునుగా భావించిన హైదరాబాదుకు చెందిన ఓ బడా రియాల్టర్ ఆ భూమిపై కన్నేసి ఇర్విన్ గ్రామానికి చెందిన చోటామోటా రియల్ ఎస్టేట్ వ్యాపారులను అండగా చేసుకొని ఆ భూమిని దౌర్జన్యంగా చదును చేస్తూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని గంగిరెద్దులను ఆడించే వారు ఆరోపిస్తున్నారు.
ఏదేమైనా ఈ భూమిని అప్పనంగా కాజేస్తున్న అందుగుల కుటుంబీకులను వారికి అండగా ఉంటున్న ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉడుముల అవినాష్ రెడ్డి పై చట్టపరమైన చర్య తీసుకొని తగు న్యాయం చేయాలని గంగిరెద్దులను ఆడించే కుటుంబీకులు రామస్వామి, ఆంజనేయులు, వెంకటయ్య, రాములు, లక్ష్మమ్మ, దుర్గమ్మ, పరమేష్, లక్ష్మయ్య సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.
సంబంధిత అధికారులు అక్రమంగా కబ్జా చేసిన ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి అవినాష్ రెడ్డికి అండగా ఉంటారా? ఊరూరు తిరిగి బిక్షం అడుక్కునే పేద గంగిరెద్దుల కుటుంబాలకు బాసటగా నిలుస్తారా మండల ప్రజలు వేచి చూడాల్సిందే.



