సూర్యాపేట జిల్లాలో అక్రమంగా జరిగిన గనుల ఈ-ఆక్షన్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి
గనుల ఈ-ఆక్షన్ ప్రక్రియలో చట్టపరమైన ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయి సుమారు 1,100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఈ గనుల టెండర్లలో భాగమైంది

సూర్యాపేట జిల్లాలో అక్రమ టెండర్లపై రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేటీఆర్
గనుల ఈ-ఆక్షన్ ప్రక్రియలో చట్టపరమైన ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయి

సుమారు 1,100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఈ గనుల టెండర్లలో భాగమైంది
చట్ట ప్రకారం తప్పనిసరిగా వెల్లడించాల్సిన DGPS డీమార్కేషన్, ఖచ్చితమైన జియో-కోఆర్డినేట్లు, ఫారెస్ట్ కంపార్ట్‌మెంట్ వివరాలు, జియాలజికల్ నివేదికలు వెల్లడించలేదు
ఎంపిక చేసిన బిడ్డర్ల(డెక్కన్ సిమెంట్స్, NCL ఇండస్ట్రీస్) చరిత్ర కూడా పలు అనుమానాలను లేవనెత్తుతుంది
కాబట్టి వెంటనే ఈ వివాదాస్పద ఈ-ఆక్షన్ ప్రక్రియను నిలిపివేసి, అక్రమ టెండర్లను రద్దు చేసి, ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను – కేటీఆర్



