హుజూర్ నగర్ లో అంతరాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్..!
గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులు హెచ్.ఎఫ్ డీలక్స్ బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, ఎస్.ఐ మోహన్ బాబు తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు

ఆరు బైకులు స్వాధీనం, ఇద్దరు నిందితుల రిమాండ్*..!
*వివరాలు వెల్లడించిన సీఐ చరమందరాజు*..!
పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హుజూర్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు లక్షల రూపాయల విలువ చేసే ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమంద రాజు వెల్లడించారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను తెలియజేశారు.
గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులు హెచ్.ఎఫ్ డీలక్స్ బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, ఎస్.ఐ మోహన్ బాబు తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకుని విచారించగా, దొంగతనాల అసలు విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసుల విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.షేక్ మాబు (28) – మేడికొండూరు, గుంటూరు జిల్లా. షేక్ రిహాజ్ (25) – గుంటూరు పట్టణం నిందితులు ఉమ్మడి నల్గొండ మరియు గుంటూరు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.వారు దొంగిలించిన ఆరు బైకుల వివరాలు ఇలా ఉన్నాయి.హుజూర్ నగర్ పరిధిలో – 01 కోదాడ టౌన్ పరిధిలో – 01 గుంటూరు నగరపాలెం పరిధిలో – 01 గుంటూరు పట్టాభిపురం పరిధిలో – 02 మంగళగిరి మండలం పరిధిలో – 01 దొంగిలించిన బైకులను నిందితుడు రిహాజ్ తన అమ్మమ్మ గారి ఊరైన కట్టవారిగూడెంలో దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. పోలీసులు అక్కడికి వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. సమయస్ఫూర్తితో దొంగలను పట్టుకున్న ఎస్.ఐ మోహన్ బాబు మరియు పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా సీఐ ప్రత్యేకంగా అభినందించారు.



