అసంపూర్తి ఇళ్లకు తీపి కబురు – ఇందిరమ్మ ఇళ్లలో పూర్తి
ఉమ్మడి ఏపీ మరియు గత ప్రభుత్వ కాలంలో మంజూరై మధ్యలో ఆగిపోయిన ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా పునాది స్థాయి వరకు ఆగిపోయిన ఇళ్లు సుమారు 9,000 గుర్తించారు. వీటిని ఇందిరమ్మ ఇండ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు.

పాలేరు, ఫిబ్రవరి 18 ( నిజం చెపుతాం న్యూస్ )
ఉమ్మడి ఏపీ మరియు గత ప్రభుత్వ కాలంలో మంజూరై మధ్యలో ఆగిపోయిన ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా పునాది స్థాయి వరకు ఆగిపోయిన ఇళ్లు సుమారు 9,000 గుర్తించారు. వీటిని ఇందిరమ్మ ఇండ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు.
ఆర్థిక సాయం వివరాలు:-
పాత ఇండ్లకు పునాది ఖర్చు రూ.1 లక్షగా పరిగణించి మినహాయింపు మిగిలిన పనులకు రూ. 4 లక్షలు విడతల వారీగా చెల్లింపు క్షేత్రస్థాయి పరిశీలనతో నిజమైన లబ్ధిదారుల గుర్తింపు బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ పదేళ్లుగా ఆగిపోయిన ఇళ్ల పూర్తి అవకాశం రావడంతో వేలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతామని మంత్రి అన్నారు.
ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, రాష్ట్రవ్యాప్తంగా పునాది స్థాయి వరకు ఆగిపోయిన ఇండ్లు సుమారు 9000 గుర్తింపుగా పొందిన ఇళ్లను పూర్తి సమాచారాన్ని రాబట్టి వాటికి తప్పనిసరిగా ఆ ఇండ్లకు పునర వైభవాన్ని తెస్తామని, మరియు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణ కార్యక్రమం భాగంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం వెనకాడదని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.
మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో “మాట తప్పని ” మడిమ తిప్పని” అనే నినాదంతో ఈ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రతి ఒక్కరూ గృహ వసతి లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మంత్రి అన్నారు.