HYDRA VS HICOURT: ప్రయివేట్ భూమిలో హైడ్రా ఫెన్సింగ్…మొట్టికాయలు వేసిన హైకోర్టు..లక్ష జరిమాన విధింపు
HYDRA VS HICOURT: ప్రైవేట్ భూమిలో హైడ్రా ఫెన్సింగ్ వేయడంతో సదరు యజమానులు తమ భూమిలో హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసారని దానిని వెంటనే తీసేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు సదరు యజమానులదే స్థలమని నిర్ధారించి వెంటనే ఫెన్సన్ తీసేయాలని హైడ్రాను ఆదేశించింది. ఫెన్సింగ్ తీసేవరకు బాధితులకు రోజుకు రూ.1 లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది.

HYDRA VS HICOURT:
కంచె తీసే వరకు రోజుకు రూ. లక్ష చెల్లించాలని ఆదేశాలు
హైడ్రాకు మరోసారి మొట్టికాయలు వేసిన హైకోర్టు
ప్రైవేట్ భూమిలో హైడ్రా ఫెన్సింగ్ వేయడంతో సదరు యజమానులు తమ భూమిలో హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసారని దానిని వెంటనే తీసేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు సదరు యజమానులదే స్థలమని నిర్ధారించి వెంటనే ఫెన్సన్ తీసేయాలని హైడ్రాను ఆదేశించింది.
ఫెన్సింగ్ తీసేవరకు బాధితులకు రోజుకు రూ.1 లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది.
వివరాల్లోనికి వెళితే
ఉప్పల్ – మల్లాపూర్‌లోని భాభానగర్ సొసైటీలో రెండు 500 చదరపు గజాల ప్రైవేట్ ప్లాట్లకు హైడ్రా కంచె వేయడంతో సదరు యజమానులు హైడ్రాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
యజమానులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపి కంచెను వెంటనే తొలగించాలని ఆదేశాలను జారీ చేయడమే కాకుండా హైడ్రాకు రూ.1 లక్ష జరిమానా విధించిన హైకోర్టు.
ఈ జరిమానాను పిటిషనర్లకు చెల్లించాలని, అలాగే కంచె తొలగించే వరకు పిటిషనర్లకు రోజు రూ.1 లక్ష చొప్పున జరిమానా చెల్లిస్తూనే ఉండాలని హైకోర్టు ఆదేశించింది.



