GOVT Hospital: 5 గురు డాక్టర్లున్న స్కానింగ్ సౌకర్యాలు అంతంతే..!

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదు అని ప్రజలు తెలుపుతున్నారు.  ముఖ్యంగా ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయడం లేదని చాలా తక్కువ మందికి మాత్రమే స్కానింగ్ చేస్తున్నారని తెలుపుతున్నారు.

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లిమిటేషన్ సంఖ్యలోనే స్కానింగ్ లు

 

రోజుకు 40 లోపు మాత్రమే స్కానింగ్లు

ఇబ్బందులు పడుతున్న మిగతా రోగులు

ఇదేమని అడిగితే తెల్లవారి రావాల్సిందే అంటున్న సిబ్బంది

 

సూర్యాపేట ఫిబ్రవరి 25,(నిజం చెపుతాం )

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదు అని ప్రజలు తెలుపుతున్నారు.

ముఖ్యంగా ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయడం లేదని చాలా తక్కువ మందికి మాత్రమే స్కానింగ్ చేస్తున్నారని తెలుపుతున్నారు.

రోజుకు వందల సంఖ్యలో ఈ ఆసుపత్రికి ప్రజలు జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి చికిత్స కోసం వస్తుంటారు.

 

ప్రతిరోజు 40 స్కానింగ్ లు మాత్రమే తీసి ఆ తర్వాత స్కానింగ్లు తీయడం లేదని తెలుస్తుంది ఇదేమని అడిగితే ఈరోజు ఇంతవరకే తీస్తాము రేపు రండి అని పంపుతున్నారని చెబుతున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ..

దీంతో చేసేదేం లేక రోజులు ప్రైవేట్ హాస్పటల్ ఆశ్రయిస్తున్నారు దీంతో ప్రైవేట్ ఆస్పత్రి వారు రోగుల నుండి స్కానింగ్ ల కోసం అధిక మొత్తంలో వసూలు చేసి ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తుంది.

 

 

దీనికంతటికీ కారణం స్కానింగ్ సెంటర్ల (హెచ్వోడీస్) మానిటరింగ్ లేక సీనియర్ రెసిడెన్స్ డాక్టర్స్ మీదనే పని భారం పడుతుందని తెలుస్తుంది.

దీనివలన పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు లేకనే పేద ప్రజలు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తుంటారు అయితే వీరి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది

రేడీయాలజీ డిపార్ట్మెంట్లో క్రొత్త డాక్టర్లని రిక్రూట్ చేసుకుని సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

12 దాటితే స్కానింగ్ చేయరు..

మధ్యాహ్నం 12 దాటితే ఒక రెడీయాలజిస్ట్ కూడా స్కానింగ్ చేయట్లేదు . ఉదయం 10 గంటలకి స్టార్ట్ చేస్తున్నారని రోగులు చెప్తున్నారు.

ఒకటి , రెండు గంటలు మాత్రమే రెడీయాలజిస్ట్ లు పనిచేసే పరిస్థితి కనపడుతుంది

ఐదుగురు డాక్టర్లున్న స్కానింగ్ సౌకర్యాలు నిల్

అత్యవసర సమయాలలో స్కానింగ్ అవసరం ఉంటే ప్రైవేట్ ఆసుపత్రి ఆశ్రయించవలసిన పరిస్థితి దాపురించింది. జనరల్ ఆస్పత్రిలో ఐదుగురు డాక్టర్లు ఉన్నప్పటికీ స్కానింగ్ సౌకర్యాలు సరిగా అందట్లేదని వాపోతున్నారు.

జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రోగులకు ఇలాంటి సమస్యలు రాకుండా పేద ప్రజలపై

ఆర్థిక భారం పడకుండా, ప్రధాన ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button