ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా
లక్ష్మి కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో అదే కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు ఎంచక్కా పాకలు వేసుకున్నారు.అంతటి ఆగకుండా కొందరు పర్మినెంట్ నిర్మాణాలకు సిద్దమయ్యారు

— లక్ష్మి కాలనీ గ్రామ పంచాయతీ సాక్షిగా ఆక్రమణ…
— రెవిన్యూ, పోలీసు అధికారుల హెచ్చరికలు గాలికి…
చర్ల ఫిబ్రవరి 13 (నిజం చెపుతాం)
మొన్నటి వరకు ఖాలీగా ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది.ఎక్కడో ఊరికి దూరంగా అనుకుంటే పొరపాటే సాక్షాత్తూ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే!
వివరాల్లోకి వెళితే లక్ష్మి కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో అదే కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు ఎంచక్కా పాకలు వేసుకున్నారు.అంతటి ఆగకుండా కొందరు పర్మినెంట్ నిర్మాణాలకు సిద్దమయ్యారు.
అయితే ప్రస్తుతం ఈ స్థలం కాలనీ వాసుల మధ్య తీవ్ర గొడవలు రేపుతోంది.ఇండ్లు ఇంటి స్థలాలు ఉన్నవారే మళ్ళీ ఆక్రమించుకున్నారని ఓ వర్గం ప్రజలు ఆరోపిస్తుండగా మరో వర్గం ప్రజలు వలసవాదుల మీకు అర్హతలు లేవంటూ వారిని విమర్శిస్తున్నారు.
చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వివాదాలు ప్రతి రోజు మాది అంటే మాది అంటూ తీవ్ర గొడవలకు దారులు తీస్తున్నాయి.అయినప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఇదే మాదిరిగా రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో అప్పుడు విధులు నిర్వహిస్తున్న అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం మళ్ళీ ఆక్రమణలకు తెరలేపారు.
అధికారుల ఆదేశాలు పట్టించుకోని వైనం…
మండలానికి కీలకమైన అధికారులు ఒకరు మండల మెజిస్ట్రేట్ తహశీల్దార్ మరియు పోలీసు హెచ్చరికలు సైతం కబ్జా దారులు పట్టించుకోలేదు.వారు వద్దని చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారు.
సాక్షాత్ మండల ముఖ్య అధికారుల పట్టించుకోలేదంటేనే అర్థం చేసుకోవచ్చు అధికారుల పనితీరు ఎలా ఉందో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జా గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు …

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటాం: తహశీల్దార్, ఎం.శ్రీనివాస్
కబ్జా గురైన ప్రభుత్వానికి ఇటీవలే సందర్శించమని గుడెసెలు తొలగించాలని ఆక్రమణదారులను ఆదేశించామని తెలిపారు.తక్షణమే గుడెసెలు తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు



