బకాయిలను వెంటనే చెల్లించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన

తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో చేసిన పనులకు సంబంధించి సుమారు రూ. 3 లక్షల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన పట్టుబట్టారు.  బిల్లుల మంజూరు కోసం పంచాయతీ కార్యదర్శి రూ. 1.50 లక్షల లంచం డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బిల్లుల మంజూరు కోసం పంచాయతీ కార్యదర్శి రూ. 1.50 లక్షల లంచం డిమాండ్

రాయపోల్ (పెద్ద ఆరేపల్లి) పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్.

దుబ్బాక ఇంచార్జ్ 19( నిజం చెపుతాం)

సిద్దిపేట జిల్లా, రాయపోల్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలో, మాజీ సర్పంచ్ రామన్నగారి కరుణాకర్ బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి పెట్రోల్ బాటిల్, పురుగుల మందుతో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో చేసిన పనులకు సంబంధించి సుమారు రూ. 3 లక్షల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన పట్టుబట్టారు.
బిల్లుల మంజూరు కోసం పంచాయతీ కార్యదర్శి రూ. 1.50 లక్షల లంచం డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, ఎంపీడీఓ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు.

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఫోన్ ద్వారా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించడంతో, సుమారు 5 గంటల నిరసన అనంతరం రాత్రి 9 గంటలకు ఆయన ట్యాంక్ దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button