హుజూర్ నగర్ కేంద్రంగా నకిలీ పురుగుమందుల తయారీ..?

పట్టణంలోని లింగగిరి రోడ్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న ముఠా, గుట్టుచప్పుడు కాకుండా ఈ నకిలీ వ్యాపారాన్ని సాగిస్తోంది. గమాజిన్ పౌడర్, ఇతర ప్రమాదకర కెమికల్ లిక్విడ్లను ఉపయోగించి నకిలీ మందులను తయారు చేస్తున్నారు.

కాలం చెల్లిన మందులే పెట్టుబడిగా కోట్లు గడిస్తున్న కేటుగాళ్లు.!

రైతును ముంచుతున్న ‘జై కిసాన్’ దందా..

ఎక్స్‌పైరీ మందులకు కొత్త లేబుళ్ళు..!

లింగగిరి రోడ్’ తయారీ కేంద్రంగా తంతు గోడం సీజ్..!

నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

ఎస్ఐ మోహన్ బాబు ..!

హుజూర్ నగర్ కేంద్రంగా సాగుతున్న నకిలీ పురుగుమందుల తయారీ దందా”ను పోలీసులు, వ్యవసాయ అధికారులు ఆదివారం సంయుక్తంగా ఛేదించారు.

“జై కిసాన్ అగ్రో ట్రేడర్స్” పేరుతో అమాయక రైతులను నిలువునా ముంచుతున్న వైనం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే..!

 

పట్టణంలోని లింగగిరి రోడ్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న ముఠా, గుట్టుచప్పుడు కాకుండా ఈ నకిలీ వ్యాపారాన్ని సాగిస్తోంది. గమాజిన్ పౌడర్, ఇతర ప్రమాదకర కెమికల్ లిక్విడ్లను ఉపయోగించి నకిలీ మందులను తయారు చేస్తున్నారు.

 

ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన విధంగా (ఉదాహరణకు: కోరో ప్లాంటా మైసిన్) 50 గ్రాములు, 100 గ్రాముల ప్యాకెట్లలో నింపి ప్యాక్ చేస్తున్నారు.

 

కాలం చెల్లిన మందులతో..!

 

ఎక్స్‌పైరీ అయిపోయిన మందులన్నింటినీ కలిపి “భూమ్ మాక్సిన్ ప్లస్” అనే లేబుళ్లతో లీటరు, అర లీటరు బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారు.

 

హుజూర్ నగర్‌కే పరిమితం కాకుండా, ఈ నకిలీ మందులను చుట్టుపక్కల మండలాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు తేలింది.

 

మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, మరియు మిర్యాలగూడెం ప్రాంతాల్లోని కొన్ని ఫెర్టిలైజర్ షాపుల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు.

 

వ్యవసాయ అధికారుల చర్యలు..!

 

హుజూర్ నగర్ వ్యవసాయ విస్తరణాధికారి (AEO) ముస్తఫా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్ఐ బండి మోహన్ బాబు, తయారీ కేంద్రాన్ని మరియు సంబంధిత షాపును సీజ్ చేశారు.

 

నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

ఈ నకిలీ మందులు ఇంకా ఎక్కడెక్కడ సరఫరా అయ్యాయో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని ఎస్ఐ మోహన్ బాబు తెలిపారు.

పురుగుమందులు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ల వద్ద తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి మరియు ప్యాకింగ్, లేబులింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button