అర్థరాత్రి అడవుల్లో తవ్వకాలు.. గుప్త నిధుల కోసమేనా…?

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అటవీ ప్రాంతాలలో అర్థరాత్రి తవ్వకాలు కలకలం రేపింది. రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం మరియు ఒక జెసిపి తో గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి అటవీ ప్రాంతాలలో తవ్వకాలను ప్రారంభించారు.

మరి ఏదైనా పని కోసమా…?

అధికారులం అంటూ జెసిబి తో అడవుల్లో తవ్వకాలు జరుపుతున్న గుర్తుతెలియని వ్యక్తులు…

అడ్డుకొని ప్రశ్నించిన సీతానగరం గ్రామ యువకులు…

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అటవీ ప్రాంతాలలో అర్థరాత్రి తవ్వకాలు కలకలం రేపింది. రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం మరియు ఒక జెసిపి తో గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి అటవీ ప్రాంతాలలో తవ్వకాలను ప్రారంభించారు.

 

రెండు దిక్కుల నాలుగు నుండి ఎనిమిది ఫీట్ల లోతు వరకు తవ్వి వదిలిపెట్టి నేషనల్ 360 హైవే రోడ్డు సమీపంలో మరో మారు తవ్వకాలు దొరుకుతున్న సమయంలో సీతానగరం గ్రామపంచాయతీ భూక్యతృ తండాకు చెందిన కొంతమంది యువకులు గుర్తించి ఆ వ్యక్తులను ఆరా తీశారు.

మేము అధికారులం ఇక్కడినుండి బియ్యం లారీ వెళుతుందని సమాచారంతో ఇక్కడ నిలబడ్డాము అని సమాధానం ఇవ్వగ నిజమే అనుకున్నారు ఆ యువకులు. కానీ అడవి ప్రాంతంలో జెసిపి సహాయంతో తవ్వకాలను జరుపుతుంటే చూసి అవ్వకయ్యారు.

అధికారులైతే అడివి ప్రాంతంలో జెసిబి తవ్వుతుంది అని అనుమానం ముచ్చి గట్టిగా ప్రశ్నించగా ఆ వ్యక్తులు తడబడ్డారు.

ఈ విషయంపై స్థానిక అటవీ శాఖ మరియు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా అటవీశాఖ అధికారులు వచ్చేలోపు ఆ వ్యక్తులు పరారయ్యారు.

అటవీ ప్రాంతంలో జరిపిన తవ్వకాలను చూసి అధికారులు షాక్ అయ్యారు ఈ తవ్వకాలు ఎందుకు చేశారో దేనికి కోసం చేశారా అనే సందిగ్ధంలో పడ్డారు.

ఇది దాదాపు గుప్త నిధుల తవ్వకాలే కోసమని ఇది గుప్త నిధుల కోసం ఇచ్చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

తవ్వకాలకు సంబంధించిన పూర్తి విషయాలు పూర్తి సమాచారంతో వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button