కన్యాకుమారి నుండి కార్గిల్ వరకు సైక్లింగ్ యాత్ర

ఆదిలాబాద్ కు చేరిన.. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ ప్రభాత్ ధరివాల్ , బృందం చే చేపట్టిన సైకిల్ యాత్ర

 

*గుడిహత్నూర్, ఫిబ్రవరి 23 2026 (నిజం చెపుతాం ప్రతినిధి)*

 

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కు..చేరిన…17 మందితో కూడిన భారత వైమానిక దళ సైక్లిస్టుల బృందం చే చేపట్టిన సైకిల్ యాత్ర… జట్టు నాయకుడు

వింగ్ కమాండర్ ప్రభాత్ ధరివాల్ ఆధ్వర్యంలో..

కన్యాకుమారి నుండి కార్గిల్ వరకు ప్రధాన సైక్లింగ్ యాత్ర చేపట్టారు..ఇచ్చోడ లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు…

ఈ సందర్భంగా …ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 3న ప్రారంభమైన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఈ యాత్ర రెండు సెగ్మెంట్లుగా కన్యాకుమారి నుండి హైదరాబాద్ వరకు

హైదరాబాదు నుండి ఢిల్లీ వరకు ఈ యాత్ర మార్చి 8 వరకు కొనసాగుతుందని…..మార్చి 8 న దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటామని… తిరిగి అక్టోబర్ 8 న భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ నుండి కార్గిల్ వరకు యాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు

.. అక్టోబర్ 22న కార్గిల్ చేరుకుంటామని… ఈ యాత్ర 3 లక్ష్యాలతో చేపట్టడం జరుగుతుందని… భారత సైన్యం మరియు వైమానిక దళం ఎలాంటి విధులు నిర్వహిస్తుంది అని..ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత… విద్యార్థులకు అవగాహన,రోడ్డు భద్రతా నియమాల గురించి యువతరానికి, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి, పాఠశాల బోధనేతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button