Cyber ​​criminals : రిటైర్డ్ జడ్జి నుండి రూ.1.66 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

మహిళతో అసభ్యకరంగా మాట్లాడారని, మనీ లాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అంశాల్లో  బెంగుళూరులో కేసు నమోదైందని  దుండగులు బెదిరించినట్లు ఆయన తెలిపారు.  సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని, ఇంట్లో చెప్తే మీ పరువే పోతుందని, ఆర్థిక లావాదేవీల వివరాలు చెప్పాలని ఒత్తిడి చేయడంతో అన్ని వివరాలు వారికి భాధితుడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు

Cyber ​​criminals : రిటైర్డ్ జడ్జిని డిజిటల్ అరెస్ట్ చేసి సైబర్ నేరగాళ్లు రూ.1.66 కోట్లు దోచుకున్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది.

8 రోజుల తర్వాత వాస్తవం తెలుసుకున్న రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించాడు.

హైదరాబాద్ – నేరేడ్‌మెట్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ రిటైర్డ్ జడ్జి(73)కి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారినని పరిచయం చేసుకున్నారు.

మీరు మహిళతో అసభ్యకరంగా మాట్లాడారని, మనీ లాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అంశాల్లో  బెంగుళూరులో కేసు నమోదైందని  దుండగులు బెదిరించినట్లు ఆయన తెలిపారు.

సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని, ఇంట్లో చెప్తే మీ పరువే పోతుందని, ఆర్థిక లావాదేవీల వివరాలు చెప్పాలని ఒత్తిడి చేయడంతో అన్ని వివరాలు వారికి భాధితుడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

వెంటనే తన ఖాతా నుండి రూ.1.66 కోట్లు మాయమవ్వడంతో భాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button