ఢిల్లీలో 10 పాఠశాలలకు బాంబు బెదిరింపుల కాల్స్

ఉదయం వేళల్లో నగరంలోని వివిధ ప్రాంతాలలోని పలు విద్యా సంస్థల నుండి అత్యవసర కాల్స్ వచ్చాయి. వెంటనే అగ్నిమాపక దళాలు, బాంబు నిర్వీర్య బృందాలు ఆ ప్రదేశాలకు వెళ్లి  క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఆ కాల్స్ నకిలీగా తేలినట్లు తెలిపారు. కానీ  ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారు.

ఢిల్లీలో 10 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే అగ్నిమాపక బృందాలు పాఠశాలల ప్రాంగణానికి చేరుకుని  తనిఖీలను కొనసాగించాయని DFS అధికారి ఒకరు తెలిపారు.

సోమవారం (ఫిబ్రవరి 9, 2026) దేశ రాజధానిలోని కనీసం 10 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయని తెలిపారు.

DFS ప్రకారం, ఉదయం వేళల్లో నగరంలోని వివిధ ప్రాంతాలలోని పలు విద్యా సంస్థల నుండి అత్యవసర కాల్స్ వచ్చాయి. వెంటనే అగ్నిమాపక దళాలు, బాంబు నిర్వీర్య బృందాలు ఆ ప్రదేశాలకు వెళ్లి  క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఆ కాల్స్ నకిలీగా తేలినట్లు తెలిపారు. కానీ  ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారు.

బాంబు గుర్తింపు మరియు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లతో పాటు, విస్తృతమైన సోదాలు నిర్వహిస్తున్నాయి.

బాంబు బెదిరింపు సందేశంలో “ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది…” అని పేర్కొన్నారు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button