Assign-Land-Kabza: ఊరకుంట శిఖం 3 ఎకరాలలో అక్రమ కట్టడం
గ్రామానికి చెందిన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు ఊరకుంట శిఖం భూమిని కూడా కలుపుకుని పెన్సింగ్ వాల్ నిర్మించారని తెలిపారు.

అనుమతి లేకుండానే నిర్మాణాలు..
ఊరకుంట శిఖం సుమారు మూడు ఎకరాలు ఆక్రమం.
వి.ఎస్.లక్ష్మిపురంలో ఊరకుంట కబ్జా కలకలం.
మూడు ఎకరాల శిఖం ఆక్రమణ ఆరోపణలు.
అనుమతి లేకుండా రోడ్డు,భవనాలు..
సాగునీరు తగ్గి 55 ఎకరాల పంటలు ప్రమాదంలో…
మహబూబాబాద్,జిల్లా,(నిజంచెపుతాం), ఫిబ్రవరి, 24:
మహబూబాబాద్ జిల్లాలో చెరువులు,కుంటాలపై అక్రమ కబ్జాలు పెరుగుతున్నాయనే ఆరోపణల నడుమ, మహబూబాబాద్ మండలంలోని వి.ఎస్. లక్ష్మిపురం (కొత్తూరు) గ్రామంలో ఉన్న ఊరకుంటా కబ్జా వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.
గ్రామ చివారులోని కౌస్య తండా సమీపంలో ఉన్న ఈ ఊరకుంటా శిఖం సుమారు మూడు ఎకరాలు ఆక్రమణకు గురైందని రైతులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు ఊరకుంట శిఖం భూమిని కూడా కలుపుకుని పెన్సింగ్ వాల్ నిర్మించారని తెలిపారు.

అదేవిధంగా కుంటాకట్ట మత్తడి నుండి సుమారు 800 మీటర్ల పొడవున శిఖం భూమిని ఆక్రమించి సుమారు 4 నుండి 5 పీట్ల ఎత్తులో మట్టి పోసి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సాగునీరు అందక పంటలు ఎండుముఖం.
సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరకుంటా నీటిపై ఆధారపడి 55 ఎకరాల్లో సాగు జరుగుతోందని రైతులు చెబుతున్నారు.
శిఖం భూమి ఆక్రమణతో కుంటా విస్తీర్ణం తగ్గి నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిందని, దాంతో పంటలకు సరైన సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలు ఎండుముఖం పట్టే పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు.
కాల్వ పూడ్చివేతపై ఆందోళన.
రైతు బానోత్ చంద్రా నాయక్ మాట్లాడుతూ, పూర్వం నుండి ఉన్న కాల్వను పూడ్చివేయడంతో వర్షపు నీరు కుంటలోకి చేరడం లేదన్నారు.
కాల్వ మూసివేత వల్ల భవిష్యత్తులో కుంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అనుమతి లేకుండానే నిర్మాణాలు?
రైతుల ఆరోపణల ప్రకారం, వ్యవసాయ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా మట్టి పోసి లేవలింగ్ చేసి ఇండ్లు నిర్మిస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా భవిష్యత్తులో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఉందని చెబుతున్నారు. వార్డు సభ్యుడు బానోత్ నరేష్,రైతు బానోత్ బాలాజీ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ సమావేశంలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాలేదన్నారు.
అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతు దండ మల్లయ్య ఆరోపణల ప్రకారం,ప్రభుత్వ భూమిని ఆక్రమించి సుమారు 20 పీట్ల వెడల్పుతో రోడ్డు వేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.



