డక్కన్ సిమెంట్ లీలలు ఇంతింత కాదయా…?

గనుల పునరుద్దరణ చేయకుండా చేపల చెరువు, పర్యాటక ప్రాతంగా తీర్చిదిద్దుతున్నామని తప్ప్పుడు నివేదికలు

అటవీ భూముల్లో పలు నిర్మాణాలు చేపట్టిన వైనం

హైదరాబాద్, ఫిబ్రవరి 21(నిజం చెపుతాం):

తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం, మహంకాళి గూడెం గ్రామ పరిదిలోని, సైదులు నామ రిజర్వేడ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్ 26,27 లో డెక్కన్ సిమెంట్ చేస్తున్న అక్రమాలు వీరికి కొమ్ముకాస్తున్న సంబంధిత అధికారుల యొక్క అవినీతి అంతా ఇంతా కాదు.
డెక్కన్ సిమెంట్ వారు చేస్తున్న అక్రమాలను వివరంగా పరిశీలిస్తే

మూడు క్యాప్టివ్ లైంస్టోన్ మైనింగ్ లీజులు కేటాయింపు…

1989వ సంవత్సరంలో ఫ్యాక్టరీ నిర్మించిన నాటినుండి ఇప్పటివరకు మొత్తం “3” క్యాప్టివ్ లైంస్టోన్ మైనింగ్ లీజులు కేటాయించడం జరిగింది, అవి 1989 సంవత్సరంలో
ఎంఎల్: 1 (22.5 హెచ్ఏ), 1999 సంవత్సరంలో ఎంఎల్: 2 (73.93 హెచ్ఏ) 2013 సంవత్సరంలో ఎంఎల్: 3 (183.11 హెచ్ఏ) ఈ పేర్కొన్న 3 మైన్ లీజులు అన్నీ ఫ్యాక్టరీకి 3దిక్కులా ఉన్న రేసేర్వేడ్ ఫారెస్ట్లోనే ఉన్నాయి,
ఐతే ఈ లీజులకు అటవీ అనుమతులు మంజూరు చేసిన కేంద్రప్రభుత్వం ఎంఓఈఎఫ్ అండ్ సీసీ చాలా స్పష్టంగా కొన్ని ముఖ్యమైన షరతులను విధిస్తూ ఆ షరతులను డెక్కన్ సిమెంట్ కంపెనీ
తప్పనిసరిగా పాటిస్తూ కేటాయించిన ఘనుల నిర్వహణ సజావుగా జరిగే విధంగా చూడవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

షరతులివే…

షరతులలో ముఖ్యమైనది ఒకటి ఘనుల పునరుద్ధరణ / తిరిగిపూడ్చి ఆ భూమిని మళ్ళి అటవీశాఖ కు అప్పగించడం
ఈ నిబంధనను గురించి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టమైన ఆదేశాలు M.O.E.F & Cc కి ఇవ్వగా కేంద్రప్రభుత్వం సైతం ఆయొక్క కోర్ట్ ఆర్డరును తప్పనిసరిగా అమలుచేయవలసినదిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.
ఐనప్పటికీ డెక్కన్ సిమెంట్ కంపెనీ ఈ మార్గదర్శకాలు, ఆదేశాలు ఏమాత్రం పాటించడంలేదు పైగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులు డెక్కన్ సిమెంట్ వారు మైనింగ్ చేసి 150 అడుగుల లోతుతో భారీ గుంతలుగా
వదిలేసిన ప్రాంతాన్ని తిరిగి పూడ్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కనుక ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, చేపల చేరువుగా, నీటి రిజర్వాయర్ గా ఉపయోగిస్తున్నామని
వివరిస్తూ చాలా దారుణమైన నివేదికలను కోర్టులకు సమర్పించి సదరు న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించారని తెలుస్తోంది.
నిజానికి పేర్కొన బడిన లీజు ఏరియాల పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుంది అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

అటవీ భూమిలో అనేక కట్టడాలు…

ఇదే కాకుండా డెక్కన్ సిమెంట్ వారికి మైనింగ్ కోసం కేటాయించిన అటవీ భూమి కాకుండా మరింత ఆటవీభూమిని ఆక్రమించి అనేక రకాలయిన కట్టడాలను ఆ ఆక్రమించిన ఆటవీ భూమిలో నిర్మిచడం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి
ఈ విషయం చాలా స్పష్టంగా నిరూపించబడిన తరువాత సదరు డెక్కన్ సిమెంట్ యాజమాన్యం కూడా ఈ తీవ్రమైన అటవీ చట్టం ఉల్లంఘనను అంగీకరించింది
ఇదంతా 2020వ సంవత్సరం లో జూన్ నేలలో జరిగింది, ఐతే 1980 వ సంవత్సరంలో మన దేశంలో అటవీ సంరక్షణ చట్టం: 1980 ( ఫారెస్ట్ కన్వరేషన్ యాక్ట్ -1980) రూపొందించబడి అమలులోకి రావడం జరిగింది
తదనుగుణంగా 1980వ సంవత్సరం తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు లేకుండా ఆటవీభూమిలో ఏరకమైన ఆటవీయేతర పనులు ఆక్రమణలు చేస్తే దాన్ని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించాలని,
అట్టి ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలను వెంటనే తొలగించి అట్టి ఆభూమిని స్వాధీన పరచుకుని తిరిగి ఆభూమిని పునరుద్ధరణచేసి
యధాతథంగా అనగా అడవిగా కొనసాగించాలనే విషయాన్ని సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశించడం జరిగింది,
ఈ ఉత్తర్వులను అనుసరించి దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల ఆటవీభూమిని ఆక్రమణల నుండి విడిపించడమేకాక కోట్లాది రూపాయల అపరాధ రుసుములు విధించడం జరిగింది

నియమ నిబంధనలను తుంగలో తొక్కారు.

డెక్కన్ సిమెంట్ విషయంలో మాత్రం 2011 నుండి 2014 మధ్యకాలంలో వీరు ఆక్రమించిన ఆటవీభూమిని దేశంలో అమలులో ఉన్న అన్ని నియమాలను , నిభందనలను ఉల్లంగిస్తూ మరల వారికే కట్టబెట్టారు
ఇది చట్ట రీత్యా నేరం మాత్రమే కాకుండా, భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం మరియు రాజ్యాంగ ధిక్కరణగా పరిగణించవలసిన అవసరం వుంది.
ఈ విషయాలను ఈ డెక్కన్ సిమెంటు ఘనుల నిర్వహణలో చేస్తున్న అక్రమాలను, ఆటవీభూముల ఆక్రమణలను, వాటి చట్టవ్యతిరేకమైన క్రమబద్ధీకరణలను మరియు వీటికి పరోక్షంగా, ప్రత్యేకంగా సహకరిస్తూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న సంబంధిత అధికారుల తీరుపై స్పష్టమైన ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేని ఫిర్యాదు దారుడు తెలుపుతున్నాడు.

మంత్రుల మధ్య చెలరేగిన చిచ్చు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులకు, సూర్యాపేట జిల్లా కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర విజలన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరియు ప్రజాప్రతినిధులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి , ముఖ్యమంత్రి సమర్పించగా
ఈ విషయమై చర్యలు తీసుకోక పోగా మంత్రుల మధ్య తీవ్రమైన దుమారం రేగి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే

ఫిర్యాదు దారుడు సురేష్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేయడంతో…


సివిసి (సెంట్రల్ విజిలెన్స్ కమీషన్), పీఎంవో (ప్రైమ్ మినిస్టర్ ఆప్ ఇండియా), విజిలెన్స్ ఎంఓఈఎఫ్ అండ్ సీసీ, సుప్రీంకోర్టు పరిధిలోని సీఈసీ(సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలకు సమర్పించగా ఈ విషయంపై స్పందించి
వారం రోజులలో నివేదికను సమర్పించవలసినదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొని సంబంధిత అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. ఇది జరిగి 3నేలల కాలం గడిచినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన, సమాధానం రాని కారణంగా ఈనెల 25 అనగా 25.02.2026న ఢిల్లీలోని సుప్రీంకోర్టుచే నియమించబదిన సీఈసీ కార్యాలయంలో విచారణకు తప్పనిసరిగా హాజరు కావలసినదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, డెక్కన్ సిమెంట్ యాజమాన్యానికి ఎండీ/ ఛైర్మన్ నోటీసులు జారీచేసింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button