గోదావరి నదిలో 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు.. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు

భద్రాచలం కూనవరం రహదారిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతంలో గోదావరి అందాలను వీక్షించేందుకు వారు వెళ్లిన క్రమంలో కొంతమంది విద్యార్థులు నదిలోకి దిగగా నదిలో లోతును సరిగ్గా అం చనా వేయలేక ఐదుగురు విద్యార్థులు స్నానం కోసం దిగగా అక్కడ లోతు ఎక్కువగా ఉండటం ప్రవాహ వేగం అకస్మాత్తు గా పెరగడం వల్ల వారు నీటిలో మునిగిపోయే ప్రమాదం నెలకొంది.

Drowned in Godavari River :  కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసు కోoది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయే ప్రమాదంలో పడి గల్లంతయ్యారు.

అమరావతిలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థుల బృందం సెలవుల సందర్భంగా భద్రాచలం పర్యటనకు వచ్చారు.

భద్రాచలం కూనవరం రహదారిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతంలో గోదావరి అందాలను వీక్షించేందుకు వారు వెళ్లిన క్రమంలో కొంతమంది విద్యార్థులు నదిలోకి దిగగా నదిలో లోతును సరిగ్గా అం చనా వేయలేక ఐదుగురు విద్యార్థులు స్నానం కోసం దిగగా అక్కడ లోతు ఎక్కువగా ఉండటం ప్రవాహ వేగం అకస్మాత్తు గా పెరగడం వల్ల వారు నీటిలో మునిగిపోయే ప్రమాదం నెలకొంది.

గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు విద్యార్థులు సహాయం కోసం కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకుని సహాయానికి ముందుకురావడం, ఇంతలో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

 

గల్లంతైన విద్యార్థుల వివరాలు

పోలీసుల సమాచారం ప్రకారం గల్లంతయ్యే విద్యార్థులు సతీశ్ (మదనపల్లి – చిత్తూరు జిల్లా), నవ దీప్ (ఉయ్యూరు – కృష్ణా జిల్లా), తేజజ్ఞ (ఉయ్యూరు – కృష్ణా జిల్లా), అభిరామ్ (భద్రాచలం), శ్రీకర్ (భద్రాచలం)గా గుర్తించారు.

వీరి లో ఇద్దరు భద్రాచలానికి చెందినవారు కాగా, మిగిలిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించగా వీరందరూ అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

దుర్ఘటన చోటుచేసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గల్లంతైన విద్యార్థుల కోసం గజఈతగాళ్ల తో గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు బోట్ల సహాయంతో నదిలో గాలించారు. ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల లోతైన గోతులు ఉండటంతో విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button