108 వాహనంలోనే డెలివరీ

ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మేడపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే పురిటి నొప్పులు తీవ్రమవడంతో, 108 అంబులెన్స్‌లోనే ఈ ఎం టి బి. ప్రవళిక, పైలట్ కట్టుల బిక్షపతి సమయస్ఫూర్తిగా స్పందించి వాహనంలోనే సురక్షితంగా ప్రసవాన్ని నిర్వహించారు.

పురిటి నొప్పులు తీవ్రమవడంతో 108 వాహనంలోనే డెలివరీ

నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తల్లి–బిడ్డ తరలింపు

నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జి , ఫిబ్రవరి 5 (నిజం న్యూస్)

నల్లబెల్లి మండలం మేడపల్లి (మేడిపల్లి) గ్రామానికి చెందిన లక్ష్మీ తండా మైసి అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే స్పందించిన 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మేడపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే పురిటి నొప్పులు తీవ్రమవడంతో, 108 అంబులెన్స్‌లోనే ఈ ఎం టి బి. ప్రవళిక, పైలట్ కట్టుల బిక్షపతి సమయస్ఫూర్తిగా స్పందించి వాహనంలోనే సురక్షితంగా ప్రసవాన్ని నిర్వహించారు.

గర్భిణి మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డలను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, వారు ఇద్దరూ పూర్తిగా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ప్రాణాపాయ పరిస్థితిలో సమయానికి సేవలందించిన 108 సిబ్బందికి మైసి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button