యాదగిరిగుట్ట దేవస్థానం నూతన డీఈవో బాధ్యతలు స్వీకరణ

-భక్తుల సౌకర్యాలే ప్రధమ లక్ష్యం : డీఈవో నవీన్ కుమార్
యాదగిరిగుట్ట,మార్చి31 (నిజంచెపుతాం)
యాదగిరిగుట్ట( యాదాద్రి) దేవస్థానం డీఈవోగా నవీన్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
దేవస్థానంలో ఉన్న సమస్యలను అధికారులు, సిబ్బంది, స్థానికులు, భక్తుల సహకారంతో పరిష్కరిస్తానని అన్నారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలు, దేవాదాయ ధర్మదాయ శాఖ సూచనల మేరకే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.టెండర్లు సహా అన్ని విషయాల్లో నియమ నిబంధనలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆలయ పరిపాలనలో సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా నూతన డీఈవో నవీన్ కుమార్కు దేవస్థానం అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.



