బంగ్లాదేశ్ లో అధికారం చేపట్టబోతున్న తారిఖ్ రెహమాన్ ఎవరు..?

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, గతంలో మూడుసార్లు ప్రధాన మంత్రిగా చేసిన ఖలీదా జియా పెద్ద కుమారుడే తారిఖ్ రెహమాన్.

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, గతంలో మూడుసార్లు ప్రధాన మంత్రిగా చేసిన ఖలీదా జియా పెద్ద కుమారుడే తారిఖ్ రెహమాన్.

బీఎన్‌పీ   పార్టీని 1978లో బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ స్థాపించారు. ఆయన దేశ స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులలో ఒకరు.

బీఎన్‌పీ బంగ్లాదేశ్‌లో పలుమార్లు అధికారం చేపట్టింది. బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ, అవామీ లీగ్‌ల మధ్య అధికార మార్పిడి జరిగింది.

గత సంవత్సరం డిసెంబర్‌లో మరణించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ అధినేత్రి ఖలీదా జియా – దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌ రాజకీయాలలో కీలక నేతగా ఉన్నారు. ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ రెహన్ ఇప్పుడు ప్రధానమంత్రి కాబోతున్నారు.

2001 నుంచి 2006 వరకు బీఎన్‌పీ, జమాత్-ఇ-ఇస్లామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెరవెనక తారీఖ్ అంతా తానై వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

 

2007లో సైనిక మద్దతు ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం హయాంలో అవినీతి ఆరోపణలపై తారీఖ్ రెహమాన్ అరెస్టయ్యారు. జైలులో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో… వైద్య చికిత్స కోసం 2008లో లండన్ వెళ్లడానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉండిపోయారు.

 

దాదాను 17 ఏళ్ల తర్వాత తన తల్లి ఖలీదా జియా మరణం తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌లో తారీఖ్ రెహమాన్ అడుగుపెట్టారు.

ఖలీదా జియా మరణించిన తర్వాత రెహమాన్ బీఎన్‌పీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన బీఎన్‌పీ యాక్టింగ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button