వేసవికాలంలో ఈ పంటలేస్తే రైతులకు లాభాలే లాభాలు…
సాధారణంగా వేసవికాలంలో రైతులు చాలా వరకు పంటలను వేయరు.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలకు నీరు అందకపోవడంతో రైతులు పంటలు వేయడానికి ఆలోచిస్తూ ఉంటారు.. ఈ పంటలు వేస్తే తక్కువ నీరుతో తక్కువ ఖర్చుతో మంచి లాభాలు చూడవచ్చు..

రైతులు యాసంగిలో చాలా తక్కువ వరకు వ్యవసాయం చేస్తూ ఉంటారు.. ఇలా చేయడానికి గల కారణం వేసవిలో వ్యవసాయ భూములకు అధికంగా నీరు పడుతుంది అని అలాగే ఉష్ణోగ్రతల వల్ల పంటలు దెబ్బతింటాయని చాలా వరకు రైతులు యాసంగి పంటలను వేయడానికి ఎక్కువగా ఇష్టపడరు.
ఒక్కసారి ఈ పంటల గురించి తెలిస్తే వేసవిలు కూడా వ్యవసాయం చేయాలనిపించే విధంగా ఉంటాయి..
వేసవిలో యాసంగి పంటలు కొన్ని ఉన్నాయి.. అవేంటంటే తక్కువ నీటితో అధిక ఉష్ణోగ్రతలని కూడా తట్టుకోని పంటలు కొన్ని ఉన్నాయి..
యాసంగి పంటల క్రింద పండించదగ్గ ముఖ్యమైన పంటలు…
వేసవికాలంలో పెసలు ,మినపలు వంటి పంటలు వేస్తే చాలా మంచిగా ఉంటుంది.. అయితే వీటికి గాను ఇవి తక్కువ నీటిని తీసుకోవడం.. అలాగే పంట 60 నుండి 70 రోజుల్లోనే చేతికొస్తుంది…
వేసవిలో కూరగాయలు పండించాలని రైతులు ఈ పంటలు వేస్తే అద్భుతంగా ఉంటాయి..
వేసవిలో కూరగాయల పండించాలి అనుకునే రైతులు టమాట అలాగే పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, కాకరకాయ, సొరకాయ వంటి పంటలను ఎంచుకొని పండించడం వల్ల తక్కువ నీరు అలాగే తక్కువ సమయంలో రైతు చేతులకు పంట అందుతుంది..
అలాగే పశుగ్రాసం పండించాలి అనుకున్న రైతులు ఈ పంటలు చూడండి..
పశుగ్రాసం పండించాలనుకున్న రైతులు జొన్న మొక్కజొన్న వంటి పశుగ్రాస పంటలను పండించవచ్చు..
ముఖ్య గమనికలు..
వేసవిలో పంట వేసే రైతులు నీటి కొడతా ఉంటే డ్రిప్ట్ ఇరిగేషన్ వంటి పద్ధతిని ఉపయోగించడం మంచిది..
ఎండ తీవ్రత నుంచి పంటను రక్షించుకోవడానికి మచిలీ పద్ధతిని పాటిస్తే చాలా మంచిది.
వేడి తట్టుకునే రకాలు ఎంచుకోవడం ఉత్తమమైన ది..



