మన ఉచిత ఇసుక వాహనం ఎక్కడ
తిరుమలాయపాలెం మండలంలో యదేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక, ఆకేరు ఏదైనా ఇసుక మాదే, అన్నట్టుగా అక్రమ రవాణా దూసుకుపోతోంది

తిరుమలాయపాలెం ఏప్రిల్ 3 నిజం చెప్పుతం న్యూస్,,
తిరుమలాయపాలెం మండలంలో యదేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక, ఆకేరు ఏదైనా ఇసుక మాదే,
అన్నట్టుగా అక్రమ రవాణా దూసుకుపోతోందితిరుమలాయపాలెం మండలంలోఇందిరమ్మ ఇళ్లలకు సిసి రోడ్ల కండక్టర్లకు మాత్రమే ఇస్తానన్న తహసిల్దార్ ఇప్పుడు కొత్త రూల్స్ తెచ్చిండు,గతంలో కాళ్లు కాళ్లు అరిగేదాకా తిరిగిన ఇవ్వని పర్మిషన్లు ఓన్లీ ప్రత్యేకంగా సిసి రోడ్ల కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చేవాడు, గత రెండు రోజుల నుంచి మాత్రం
ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకీ పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆకేరు, పాలేరు ఏరు అనే తేడా లేకుండా “మాదే రాజ్యం” అన్నట్టుగా అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా సాగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల కళ్ల ముందే ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానాలు గ్రామాల్లో గుసగుసలుగా వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ శాఖలు పట్టించుకోకపోవడం వల్ల మాఫియా మరింత రెచ్చిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కూపన్ వ్యవస్థలో భారీ అక్రమాలు…
ఒక రోజు కోసం ఇచ్చే కూపన్‌తో మూడు రోజుల పాటు ఇసుక రవాణా చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇది వ్యవస్థలోని లోపాలకే కాకుండా, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మధ్యవర్తులుగా ట్రాక్టర్ యజమానులు
కొంతమంది ట్రాక్టర్ యజమానులే అధికారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారనే సమాచారం బయటకు వస్తోంది. దీంతో మాఫియా మరింత పట్టు సాధించిందని స్థానికులు చెబుతున్నారు.
ముజాహిద్‌పురం ఏటి లో నిరంతర తవ్వకాలు….
కాకరవాయి, ముజాహిద్‌పురం హైదర్ సాయి పేట పడమటి తండా పిండిప్రోలు తిరుమలాయపాలెం ఆకేరు పరివాహక ప్రాంతాల్లో నిరంతరంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. “ఇందిరమ్మ ఇళ్లు”, “సీసీ రోడ్లు” వంటి అభివృద్ధి పనుల పేరుతో యథేచ్చగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
నిఘా ఎక్కడ?
తిరుమలాయపాలెం మండలంలో ఇసుక రవాణాపై సరైన నిఘా లేదనే ప్రశ్నలు లేవుతున్నాయి. అధికారుల మౌనం మాఫియాకు సహకారంగా మారిందా అనే సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయిగత రెండు నెలల క్రితం ఇసుక అక్రమ రవాణా పై జిల్లా పోలీస్ కమిషనర్ సిపి ఆదేశాల మేరకు కాకరవాయి గ్రామపంచాయతీ ప్రాంగణంలో పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది అక్రమ ఇసుక వ్యాపారానికి ఉక్కు పాదం మోపటంతో ఇసుక మాఫియా వ్యాపారులు కాస్త వెనక్కు తగ్గినప్పటికీ
అనివార్య కారణాల రిత్యా అక్కడ నుండి చెక్ పోస్ట్ ఎత్తివేయడంతో ఇసుక అక్రమ రవాణా వ్యాపారస్తులు యదేచ్చగా భయం లేకుండా ఇప్పుడు రవాణా చేస్తున్నారు అయినా సరే యంత్రాంగం మాకేమిటి పట్టనట్లుగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకునే వ్యవహారంగా గ్రామస్తులు తెలియపరుస్తున్నారు.
పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు…
అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనేదాడులు చేపట్టాలికూపన్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలినిరంతర నిఘా ఏర్పాటు చేయాలిప్రజల సంపదను దోచుకుంటున్నఈ ఇసుక మాఫియాను ప్రధానంగా అరికట్టాల్సింది మైనింగ్ రెవెన్యూ శాఖలదే ప్రధాన బాధ్యత ఉంటుంది అట్టి శాఖల అధికారులు ఇసుక మాఫియాను అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు



