ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ డబ్బులు.. రాకపోతే ఇలా చేయండి ..?
మీ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండటం, అలాగే మీ బ్యాంక్ ఖాతా 'యాక్టివ్' లో ఉండటం తప్పనిసరి..!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. అర్హులైన రైతులు తమ మొబైల్ ఫోన్లకు వచ్చే SMS ద్వారా లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా నగదు పడిందో లేదో సరిచూసుకోవచ్చు.
మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే మెసేజ్ చూడండి. లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి పాస్ బుక్ ప్రింట్ చేయించుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.
Google Pay, PhonePe లేదా యోనో వంటి యాప్స్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. లేదా ట్రెజరీ వెబ్సైట్ లేదా సంబంధిత పోర్టల్‌లో మీ ‘పట్టాదారు పాస్ బుక్’ నంబర్ నమోదు చేసి స్టేటస్ చూడవచ్చు.
ఒకవేళ ఇంకా డబ్బులు జమ కాకపోయి ఉంటే ఆందోళన చెందకండి. ప్రభుత్వం విడతల వారీగా (తక్కువ ఎకరాల నుండి ఎక్కువ ఎకరాల వరకు) నిధులు విడుదల చేస్తోంది.
మీ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండటం, అలాగే మీ బ్యాంక్ ఖాతా ‘యాక్టివ్’ లో ఉండటం తప్పనిసరి.



