అకాల వర్షం… అపార నష్టం.
500 ఎకరాల పంట నష్టం, మహా మండలంలో బీభత్సం. తక్షణమే ఆదుకోవాలి రైతులు.

500 ఎకరాల పంట నష్టం, మహా మండలంలో బీభత్సం.
మహదేవపూర్ భూపాల్ పల్లి మార్చ్ 31( నిజం న్యూస్)
అకాల వర్షం మహా మండలంలో రైతుల పంటలకు అతలాకుతలం చేసింది, సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం మరియు ఎదురుగాలులతో, సుమారు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది.
మహాదేవపూర్ మండల కేంద్రం తో పాటు పలివెల మండలంలో సైతం సుమారు 150 నుండి 200 ఎకరాల వరకు మొక్కజొన్న మిర్చి పంటలు, నెల కొరకడం జరిగింది.
చేతికొచ్చిన పంట రేపో మాపో విక్రయాల కొరకు తరలించుకొనుటకు సిద్ధంగా ఉన్న పంట, నీలకొరకడం అలాగే నీటిమట్టం కావటం, జీర్ణించుకోలేకపోతున్నారు ఉమ్మడి మండల రైతులు.
500 ఎకరాల పంట నష్టం, మహా మండలంలో బీభత్సం….
భారీ అకాల వర్షం పెద్ద ఎత్తున ఎదురుగాలు సంభవించడంతో మహాదేవపూర్ మండల కేంద్రం సుమారు 250 ఎకరాల మిర్చి, అన్నారం కాలేశ్వరం సూరారం అంబటిపల్లి, మద్దులపల్లి, గ్రామాల్లో మరో 200 ఎకరాల మిర్చి మరియు మక్కజొన్న తో పాటు కొన్ని కూరగాయల కు సంబంధించిన పంటలు పూర్తిగా నీలమట్టమై కాయలు రాలిపోవడం జరిగింది.
విక్రయానికి సిద్ధంగా ఉన్న పంట సుమారు 42 60 శాతం ఒకేసారి నేలకొరిగి నీటిమట్టం కావడంతో, రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు, అలాగే పలిమెల మండలంలోని పంకెన పలిమెల తోపాటు సర్వాయిపేట్ ముక్కునూరు నీలంపల్లి గ్రామాల్లో మిర్చి మరియు, కూరగాయలకు సంబంధించిన పలు రకాల పంటలు, పెద్ద మొత్తంలో నష్టానికి గురి కావడం జరిగింది.
ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అందించి రైతులకు ఆదుకోవాలని, కోరుతున్నారు బాధిత రైతులు. విపత్తుల ఒకేసారి అకాల వర్షం పెద్ద మొత్తంలో ఎదురు గాలులు వీచి వందల ఎకరాల నీలమట్టం చేసి పేద రైతులకు లక్షల రూపాయల నష్టాల్లోకి తిట్టడం జరిగింది,
జిల్లా కలెక్టర్ తక్షణమే వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీచేసి, నష్టం వాటిల్లిన పంటల వివరాలను సేకరించి, వారికి నష్టపరిహారాన్ని అందించే దిశగా ఆదేశించాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు బాధిత రైతుల



