ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్లోనూ ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా చెలరేగుతున్నారు. ఓపెనర్ సూర్యవంశీ సెంచరీ చేశాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రమే అర్థ సెంచరీ సాధించాడు

వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

భారీ స్కోరు దిశగా భారత్

హరారే: అండర్‌-19 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరింది. అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు.

శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్లోనూ ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా చెలరేగుతున్నారు. ఓపెనర్ సూర్యవంశీ సెంచరీ చేశాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రమే అర్థ సెంచరీ సాధించాడు

భారత్‌ ఖాతాలో ఆరో టైటిల్‌ చేరడానికి గట్టి పునాది పడింది. 2022లో మన కుర్రాళ్లు చివరిసారి ఇంగ్లండ్‌ జట్టుపైనే గెలిచి కప్‌ సాధించారు.

2024 లో రన్నరప్ గా…

2024లోనూ కప్‌ కోసం పోరాడినా ఆసీస్‌ చేతిలో ఓడి రన్నర్‌పతో సంతృప్తి పడాల్సి వచ్చింది. దీనికి ముందు జరిగిన 15 టోర్నమెంట్లలో యువ భారత్‌ తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరి, ఐదుసార్లు విశ్వవిజేతగా నిలవడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. మహ్మద్‌ కైఫ్‌, విరాట్‌ కోహ్లీ, ఉన్ముక్త్‌ చంద్‌, పృథ్వీ షా, యష్‌ ధుల్‌ సారథ్యంలో భారత్‌కు ట్రోఫీలు లభించాయి. మరోవైపు ఇంగ్లండ్‌కిది మూడో ఫైనల్‌ కాగా 1998 తర్వాత మరోసారి విజేతగా నిలవాలని ఆరాటపడుతోంది.

ఒక్క ఓటమి కూడా లేకుండా…

భారత్‌లాగే ఈ జట్టు ఖాతాలోనూ ఒక్క ఓటమి లేకపోవడం గమనార్హం. పైగా సెమీ్‌సలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీసను ఓడించి ఊపు మీదుంది. దీంతో ఫైనల్‌ సమరం అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button