ట్రాఫిక్ సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ, మెకానిక‌ల్ సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ పోస్టుల పరీక్ష హాల్ టికెట్లను ఆరోజు నుండి డౌన్లోడ్ చేసుకోండి.

TSLPRB ఆధ్వర్యంలో TGSRTC లోని 198 ట్రాఫిక్ (84) & మెకానికల్ (114) సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల రాత పరీక్షలు 2026 మార్చి 29న జరగనున్నాయి.

ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకు (TST), మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు (MST) రెండు సెషన్లలో ఈ పరీక్షలు ఉంటాయి.

హాల్ టిక్కెట్లు మార్చి 23 నుండి అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమైన వివరాలు:

పరీక్షా తేదీ: 29 మార్చి 2026 (ఆదివారం).

హాల్ టిక్కెట్లు: https://www.tgprb.in లో మార్చి 23, 2026 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షా విధానం: 200 మార్కులకు OMR ఆధారిత (Objective type) పరీక్ష.

విషయాలు: సూపర్‌వైజరీ ఆప్టిట్యూడ్ (60), రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మరియు న్యూమరికల్/ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ (40).

భాష: పరీక్షా పత్రం ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది.

అర్హత మార్కులు: OC/EWS – 40%, BC – 35%, SC/ST – 30%.

అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే సందర్శించి, హాల్ టిక్కెట్‌పై ఉన్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడమైనది

TSLPRB ఆధ్వ‌ర్యంలో 198 ట్రాఫిక్ సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ, మెకానిక‌ల్ సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన రాత ప‌రీక్ష‌లు మార్చి 29న నిర్వ‌హించ‌నున్నారు.

అభ్య‌ర్ధులు త‌మ హాల్ టికెట్ల‌ను ఈ నెల 23వ తేదీ నుంచి tgprb.in వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button