జిల్లాలో సమృద్ధిగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిల్వ, కలెక్టర్.
పౌర సరఫరా శాఖ అధికారులు, ఎనర్జీ సప్లై మానిటరింగ్ సమావేశం. గ్యాస్ పెట్రోల్ డీజిల్ పై వచ్చే అసత్య ప్రచారాలు నమ్మొద్దు, ఎస్పి.

జిల్లాలో సమృద్ధిగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిల్వ, కలెక్టర్.
పౌర సరఫరా శాఖ అధికారులు, ఎనర్జీ సప్లై మానిటరింగ్ సమావేశం.
గ్యాస్ పెట్రోల్ డీజిల్ పై వచ్చే అసత్య ప్రచారాలు నమ్మొద్దు, ఎస్పి.
పదవ తరగతి పరిక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.
భూపాలపల్లి, మహదేవపూర్: మార్చి 28 (నిజం న్యూస్)
జిల్లాలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ పై పటిష్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తూ గ్యాస్ పెట్రోల్ మరియు డీజిల్ నిల్వ సమృద్ధిగా ఉన్నాయని, ఇలాంటి కొరత లేదని అన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. శనివారం రోజు ఐడిఓసి కార్యాలయంలో పౌరసరఫర అధికారులతో పాటు ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గృహ అవసరాలకు వినియోగించవలసిన సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే, కేసు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 20,000 మంది గ్యాస్ వినియోగదారులు, జిల్లాలోని వసతి గృహాలకు ఆసుపత్రులకు అలాగే పాఠశాలలకు యధావిధిగా సరఫరా జరుగుతుందని తెలిపారు, ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. మండలాల్లో డిప్యూటీ తహసిల్దార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు కలెక్టర్, వాహనాల తనిఖీలు చేసి కేసు నమోదు చేయాలని ఆర్టీవోకు సూచించడం జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు బుకింగ్ ప్రక్రియ అమలులో ఉందని, వాటి ప్రకారం సిలిండర్ సరఫరా జరుగుతుందని తెలిపారు కలెక్టర్. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే తక్షణమే సమాచారం ఇవ్వాలి అన్నారు. బ్లాక్ మార్కెట్ రి ఫీలింగ్ పై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి అక్రమ విలువ అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీజిల్ మరియు పెట్రోల్ నిలువ పై అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు, అక్రమ నిల్వ బ్లాక్ మార్కెటింగ్ డ్రైవ్ నిర్వహించి ఇప్పటికీ 19 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ పై వచ్చే అసత్య ప్రచారాలు నమ్మొద్దు, ఎస్పి.
ఎనర్జీ మానిటరింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత ఉందని సామాజిక మాధ్యమంలో వచ్చే అసత్యపు ప్రచారాలను సూచించారు, జిల్లాలో సరిపడా డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిల్వ ఉందని, ఆందోళనకు గురి కావద్దని ప్రజలకు కోరడం జరిగింది. అసత్యపు ప్రచారాలు తమ పర్యవేక్షణలో ఉన్నాయని, పెట్రోల్ బంక్ మరియు గ్యాస్ గోదాముల వద్ద ఇలాంటి రద్దీ లేకుండా పటిష్ట నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ బయాన్ సింగ్ డి ఈ ఓ రాజేందర్ జిల్లా వైద్య అధికారి మధుసూదన్ సంక్షేమ శాఖల అధికారులు హెచ్పిసిఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్య దాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి పరిక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.
జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ అకాస్మికంగా తనిఖీ చేశారు. శనివారం రోజు జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న గణిత పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు అలాగే, పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ఆరోగ్య శిబిరాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు, గణిత పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్, 200 మంది రెగ్యులర్ ముగ్గురు ప్రైవేట్ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు. అనంతరం ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు, అత్యవసర మందులతో పాటు వారి పాకెట్లు సిద్ధంగా ఉంచాలని, విద్యార్థులు అస్తవ్యస్తకు గురైతే ముందస్తు చికిత్స అందించుటకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వైద్యులకు తెలిపారు. కలెక్టర్ అకస్మిక తనిఖీలు ఎంపీడీవో నాగరాజు అధికారి లక్ష్మి తో పాటు తదితరులు ఉన్నారు.



