వలస ఆదివాసి కూలీల కష్టాలు…ఇసుక దిన్నలే తేనె పాన్పులు 

వలస ఆదివాసి కూలీల…కష్టాలు

 

ఇసుక- దిన్నలే తేనె పాన్పు

 

చర్ల మార్చి30 (నిజం చెపుతాం) ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి మిర్చి కూలి పనుల కోసం వచ్చే వలస ఆదివాసిల కష్టాలు వర్ణనాతీతం ఇసుక దిన్నెలపైనే నివాసం ఉంటూ పడరాని పాట్లు పడుతున్నారు.

చలికి వానకు ఎండను భరిస్తూ కూటి కోసం కోటి కష్టాలను అనుభవిస్తున్నారు.

ఉదయం ఎనిమిది గంటలకు కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఐదున్నర వరకు పనులు చేసుకుని వచ్చి. వంటలు చేసుకుని తిని నిద్రపోయేసరికి ప్రతిరోజు 9 నుండి 10:00 గంటలు కావస్తుంది.

వంట చేసుకోవటానికి పొయ్యిలోకి కట్టెలు తెచ్చుకోవడానికి తెల్లవారుజాము నాలుగింటికి నిద్ర లేచి కట్టెల కొరకు గోదావరి తీర ప్రాంతాల నుండి సుమారు ఒక ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి కట్టెల బరవు నెత్తి మీద పెట్టుకుని ఒకరి వెనుక ఒకరు క్యూ తప్పకుండా చీమలదండులా మకాం చేరుకోవడాన్ని

చూస్తే ప్రతి ఒక్కరు ముక్కున వేలించుకోవాల్సిందే. వారి క్రమశిక్షణ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button