T20 WORLD CUP SUPER 8 : సూపర్ 8లో ఎవరితో ఎవరు
టీ20 ప్రపంచ కప్ 2026.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఇప్పటికే ఏడు జట్లు భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. ఎనిమిదో జట్టుగా పాకిస్థాన్ లేదా యూఎస్ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సూపర్ 8లో ఎవరెవరితో ఆడనున్నారు…
టీ20 ప్రపంచ కప్ ఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. ఈ నేపథ్యంలో సూపర్ 8లో ఎవరితో ఎవరెవరు ఆడనున్నారో తెలియనుంది.
సూపర్ 8లో భాగంగా భారత్‌తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు గ్రూప్ 1 లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి.
న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకతో పాటు పాక్ కాని యుఎస్ఏ కాని గ్రూప్ 2లో ఉంటాయి. ఈ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి.
ప్రతీ ఒక్కరూ 3 మ్యాచ్ లు ఆడాల్సిందే
గ్రూప్ 1 లో భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఒకరితో ఒకరు 3 మ్యాచులను ఆడనున్నారు.
గ్రూప్ 2 లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకతో పాటు పాక్ కాని యుఎస్ఏలు ప్రతీ ఒక్కరితో ఒక్కో మ్యాచ్ లు ఆడనన్నారు.
గ్రూప్ 1, గ్రూప్ 2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరగనున్నాయి.
సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్‌లో తలపడతాయి.