T20 WORLD CUP: సెమీస్ లో రెండు బెర్త్ లు ఖరారు…మరో రెండు బెర్త్ ల కోసం పోటీ…ఇండియా సెమీస్ కు చేరాలంటే
టి20 ప్రపంచ కప్‌లో ఇద్దరు సెమీ-ఫైనలిస్టులు ఖరారయ్యారు. చివరి రెండు స్థానాలను కైవసం చేసుకోవడానికి మరికొన్ని జట్లు ఎదురు చూస్తున్నాయి.

టి20 ప్రపంచ కప్‌లో ఇద్దరు సెమీ-ఫైనలిస్టులు ఖరారయ్యారు. చివరి రెండు స్థానాలను కైవసం చేసుకోవడానికి మరికొన్ని జట్లు ఎదురు చూస్తున్నాయి.
సూపర్ ఎయిట్ లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపు నుండి మొదటి రెండు స్థానాలు సాధించిన జట్లు మాత్రమే సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
భారతదేశం, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మరియు జింబాబ్వే గ్రూప్ 1లో ఉండగా,
గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక మరియు పాకిస్తాన్ ఉన్నాయి.
గ్రూప్ 1
దక్షిణాఫ్రికా (Q), 4 పాయింట్లు, +2.890 NRR కలిగి ఉంది.
భారత్, వెస్టిండీస్ లను ఓడించిన దక్షిణాప్రికా చివరి మ్యాచ్ లో జింబాబ్వేతో తలపడనుంది. జింబాబ్వే పై ఓడిపోయినా మెరుగైన రన్ రేట్, పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.
వెస్టిండీస్, 2 పాయింట్లు, +1.791
T20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ విజయాలు గురువారంతో ముగిసాయి. దక్షిణాఫ్రికా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఆదివారం భారత్‌తో జరిగే చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో విజయం సాధించాలి. భారత్‌పై ఓడితే వెస్టిండీస్ సెమీఫైనల్‌కు దూరమవుతుంది.
భారత్, 2 పాయింట్లు, -0.100
గురువారం జింబాబ్వేపై భారత్ విజయం సాధించడంతో సెమీస్ ఆశలు ఉన్నాయి.
ఆదివారం వెస్టిండీస్‌తో తమ చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్ ఆడనుంది. వెస్టిండీస్‌పై విజయం సాధిస్తే భారతదేశం సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
జింబాబ్వే, 0 పాయింట్లు, -4.475
వెస్టిండీస్, భారత్ మ్యాచ్ లలో జింబాబ్వే ఓడిపోవడంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఆదివారం ఢిల్లీలో జరిగే చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
గ్రూప్ 2
ఇంగ్లాండ్ (Q), 4 పాయింట్లు, +1.491 NRR
ఆదివారం కాండీలో శ్రీలంకపై 51 పరుగుల తేడాతో, మంగళవారం అదే వేదికపై పాకిస్తాన్‌పై విజయంతో సెమీస్ చేరువయ్యారు.
ఇంగ్లాండ్ జట్టు తమ చివరి సూపర్ ఎయిట్ లో భాగంగా న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. గెలిస్తే గ్రూప్ 2లో అగ్రస్థానం దక్కనుంది.
న్యూజిలాండ్, 3 పాయింట్లు, + 3.050
బుధవారం శ్రీలంకపై న్యూజిలాండ్ సాధించిన అద్భుతమైన 61 పరుగుల విజయం సెమీ-ఫైనల్స్‌కు చేరడానికి అవకాశం ఉంది. కానీ ఇంకా ఖరారు కాలేదు.
న్యూజిలాండ్ చివరి సూపర్ ఎయిట్స్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ తో ఆడనుంది.
అదే రోజు శ్రీలంకతో పాకిస్తాన్ ఆడే చివరి మ్యాచ్ ఫలితాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ పై ఓడిపోయినా మెరుగైన రన్ రేట్ తో సెమీస్ కు చేరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ శ్రీలంకపై గెలిచినా పాకిస్తాన్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది
పాకిస్తాన్, 1 పాయింట్, -0.461
న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో ఓడిపోయి పాకిస్తాన్ సెమీస్ స్థానాన్ని క్లిష్టం చేసుకుంది. పాకిస్తాన్ సెమీస్ కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ను ఓడించి, ఆ తర్వాత శ్రీలంకను మెరుగైన నెట్ రన్ రేట్ తో ఓడించాల్సి ఉంటుంది
శ్రీలంక, 0 పాయింట్లు, -2.800
ఇంగ్లాండ్ , న్యూజిలాండ్‌లతో ఓడిపోవడంతో శ్రీలంక సెమీస్ కు చేరడం కష్టంగా మారింది. నామమాత్రమైన చివరి మ్యాచ్ ను పాకిస్తాన్ తో శనివారం కాండీలో జరుగుతుంది. అయితే పాకిస్తాన్ ను ఓడిస్తే పాకిస్తాన్ సెమీస్ ఆశలకు గండి కొట్టే అవకాశం ఉంది.



