T20 World Cup: దక్షిణాఫ్రికా ఘన విజయం.. భారత్ సెమీస్ ఆశలు సజీవం

T20 World Cup: వెస్టిండీస్ తో గురువారం జరిగిన టి20 సూపర్ 8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా  జట్టు వెస్టిండీస్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకుంది

T20 World Cup :వెస్టిండీస్ తో గురువారం జరిగిన టి20 సూపర్ 8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా  జట్టు వెస్టిండీస్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకుంది.

మొదట బ్యాటింగ్  చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి176 పరుగులు చేసింది.  వెస్టిండీస్ జట్టులో  షెఫర్డ్ అర్థ సెంచరీ తో రాణించగా, హోల్డర్ 49 పరుగులు చేశాడు.

వెస్టిండీస్ జట్టు 83 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడగా ఎనిమిదో వికెట్ కు షెఫర్డ్, హోల్డర్లు 89 పరుగులను జోడించి ఆదుకున్నారు.

దక్షిణాఫ్రికా బౌలర్లు ఇంగిడి 3 వికెట్లను తీయగా రబడ, బోస్కులు రెండు వికెట్లను సాధించారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో డికాక్ వికెట్  మాత్రమే కోల్పోయి 177 పరుగులను చేసి విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ మార్కరం 82, రికెల్టన్ 42 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు.

దీంతో దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరుకుంది

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button