వరి పంటకు గడ్డి మందు కొట్టిన అగంతకులు…మహిళా రైతు ఆవేదన.. రూ. 5 లక్షల ఆస్తి నష్టం.
తనకు వ్యతిరేకంగా ఉన్న కోట్ల సునీత, కోట్ల వెంకటరెడ్డితో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన పొలానికి గడ్డి మందు కొట్టారని తెలిపారు.

5 ఎకరాల వరి పంటకు గడ్డి మందు కొట్టిన వ్యక్తులు.
దాచారంలో మహిళా రైతు ఆవేదన రూ. 5 లక్షల ఆస్తి నష్టం.
పంట పొలాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వ అధికారులు.
నేరేడుచర్ల, మార్చి /20 -నిజం చెపుతాం న్యూస్ :-
నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5 ఎకరాల 14 గుంటల భూమికి గడ్డి మందు కొట్టడంతో ఎండి పోయిందని, తద్వారా తనకు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని దాచారం గ్రామానికి చెందిన మహిళా రైతు పేరాల శ్రీదేవి తెలిపారు. శ్రీదేవి శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
2003లో తాను పొలం కొనుగోలు చేశానని అప్పటి నుంచి తాను భూమి సాగు చేసుకుంటుండగా, 2018లో ధరణిలో తనకు కొత్త పాసుపుస్తకం రాలేదని తెలిపారు. తనకు తెలియకుండా పట్టా మార్పు జరగడంతో తనకు అనుమానం వచ్చి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.
తనకు అనుకూలంగా 2025లో తీర్పు రావడంతో వరి సాగు చేసుకుంటున్నానని తెలిపింది. ఇదే తీర్పు ఆధారంగా తనకు కొత్త పాసుపుస్తకం వచ్చిందని తెలిసింది. తనకు వ్యతిరేకంగా ఉన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన పొలానికి గడ్డి మందు కొట్టారని తెలిపారు.
గత నాలుగు రోజుల నుంచి పొలం పూర్తిగా ఎండిపోవడంతో అనుమానం వచ్చి వెంటనే అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు పోయారని తెలిపారు.
ఈ సంఘటనపై తగు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఎస్‌ఐ రవీందర్ వివరణ:-
ఈ విషయంపై స్థానిక ఎస్‌ఐ రవీందర్‌ను వివరణ కోరగా శ్రీదేవి తన పొలానికి గడ్డి మందు కొట్టారని ఫిర్యాదు చేసిందని తెలిపారు.
కేసు నమోదు చేసి విచారణ చేపడుతామని, ఈ విషయంపై స్థానిక తహసీల్దార్, వ్యవసాయాధికారులకు కూడా సమాచారం అందించినట్లు తెలిపారు. బాధ్యులైన వారిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.



