SunRisers Leeds: పాక్ ప్లేయర్ కొనుగోలు వివాదం..సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…SRH.. X-అకౌంట్ సస్పెండ్
పాక్ స్పిన్నర్ ₹2.34 కోట్లకు అబ్రార్‌ను దక్కించుకోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ వివాదం మధ్య సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక X అకౌంట్ సస్పెండ్ కావడం మరో షాక్‌గా మారింది.

SunRisers Leeds: ఇంగ్లండ్ టోర్నీ The Hundred వేలంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
₹2.34 కోట్లకు అబ్రార్‌ను దక్కించుకోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ వివాదం మధ్య సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక X అకౌంట్ సస్పెండ్ కావడం మరో షాక్‌గా మారింది.
రూల్స్ ఉల్లంఘన, యూజర్ రిపోర్ట్స్ కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్న ఫ్యాన్స్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు.
భారత సైన్యంపై విమర్శలు చేసిన వాడికి జట్టులో ఎలా చోటు ఇస్తావంటూ ఫైర్ అవుతున్నారు.
పాక్ ఆటగాళ్లను అనుబంధ ఫ్రాంచైజీలు అవాయిడ్ చేస్తాయన్న వార్తల మధ్య ఈ కొనుగోలు మరింత చర్చనీయాంశంగా మారింది.



