విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో సుమారు.. 12 వేల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో.. చదువుతున్నందున, వారికి అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు.

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
  • “ఈట్ రైట్” కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలి
  • సోషల్ మీడియాలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారుతున్నాయి
  • మెనూ ప్రకారం 100 శాతం ఆహారం అందించాలి

రామగుండం ఏప్రిల్ 6, (నిజం న్యూస్)

ఈ సమావేశంలో.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,ఆహార విషబాధ, వాంతులు,తాగునీటి సమస్యలు వంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం చిన్న చిన్న విషయాలు కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద సమస్యలుగా మారుతున్నాయని, రాజకీయ కారణాలతో అవి మరింత విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.ఇటీవల మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు బయట ఆహారం తీసుకొని అస్వస్థతకు గురైనప్పటికీ,ప్రభుత్వ పాఠశాలలపై విమర్శలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వంటలో ఉపయోగించే కూరగాయలు,గుడ్లు, మాంసం వంటి పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయాలని,వంట విధానం,పదార్థాల నాణ్యతపై వంట మనుషులు అత్యంత జాగ్రత్త వహించాలని ఆదేశించారు.

ప్రత్యేకంగా మాంసాహార వంటకాలు మరింత శ్రద్ధతో తయారు చేయాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత,ముఖ్యంగా గోర్లు వంటి అంశాలపై కూడా పర్యవేక్షణ అవసరమని తెలిపారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నందున, వంట ప్రక్రియలో ద్విగుణిత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచి,చెల్లింపులు సమయానికి చేస్తున్నందున, నిర్ణయించిన మెనూను ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం పాటించాలని,

అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఒకే సాధారణ మెనూను అమలు చేయాలని ఆదేశించారు.
గత ఏడాది ముత్తారం కేజీబీవీలో జరిగిన ఆహార విషబాధ ఘటన పునరావృతం కాకుండా,ప్రతి రోజు అప్రమత్తంగా ఉండాలని వంట మనుషులకు సూచించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button