యువ బ్లాగర్ కు బిజినెస్ సోషల్ మీడియా 2026 అవార్డు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన యువ ఫుడ్ బ్లాగర్ మామిడాల భార్గవ్ (తిందాం బ్రో ) హైదరాబాద్‌లో నిర్వహించిన బిజినెస్ సోషల్ మీడియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా,కురవి,(నిజం చెపుతాం ),మార్చి,18:
మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన యువ ఫుడ్ బ్లాగర్ మామిడాల భార్గవ్ (తిందాం బ్రో ) హైదరాబాద్‌లో నిర్వహించిన బిజినెస్ సోషల్ మీడియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.
సికింద్రాబాద్‌లోని లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్, బిజీ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్ సృష్టిస్తూ మంచి గుర్తింపు పొందినందుకు భార్గవ్‌ను సత్కరించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫుడ్ బ్లాగింగ్ చేస్తూ వివిధ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ మరియు ప్రత్యేక వంటకాలను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “తిందాం బ్రో ” ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నారు.
ఆయన సోషల్ మీడియా ఖాతాలకు ప్రస్తుతం సుమారు 60 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామానికి చెందిన యువకుడు ఈ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.