Shivaratri: శివునికి ఇష్టమైన రోజు శివరాత్రి
హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది.

*శివ నామస్మరణంతో మారుమోగే రోజు,” నేడే “మహా శివరాత్రి”.
*మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కాళేశ్వరం.*
*జిల్లా మరియు రాష్ట్ర రాజధాని నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. అధికారులు పోలీసుల ప్రత్యేక బందోబస్తు.*
*భూపాలపల్లి: మహాదేవపూర్,జనవరి14(నిజం న్యూస్)*
చాంద్రమనం నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది.
శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో తెలపడం జరిగింది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, శివరాత్రి ఫిబ్రవరి నెలలో రావడం జరిగుతుంది .
సనాతన మాసం ప్రకారం మాఘ మాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో ఒకటి మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించడం తో ఈ ఆదివారం రాత్రిని మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధి గాంచిన ఆలయం కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని , శివుని భక్తుల దర్శనం కొరకు సిద్ధం చేయడం జరిగింది వేలాది సంఖ్యలో భక్తులు చేరుకొని గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి శివ లింగానికి పూజలు చేయడం జరుగుతుంది.
కాళేశ్వర ఆలయం తోపాటు మండల కేంద్రంలోని శివాలయం మందరగిరి వెంకట స్వామి ఆలయం తో పాటు మండలంలోని ఇతర ఆలయాలు, అలాగే జిల్లాలోని కోటగుళ్లు ఆలయం కూడా శివరాత్రి పర్వదినాన సందర్భంగా ముస్తాబు చేయడం జరిగింది.
బిల్వార్చనసవరించు:-
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం.
బుధవారం శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది .
పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఆనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు “ఓం నమః శివాయ”, శివుని యొక్క పవిత్ర మంత్రం పఠించడంజరుగుతుంది.
*ఆధ్యాత్మిక శక్తిసవరించు*
తపస్సు, యోగ, ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా, వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు, ఉత్తర ధ్రువం లోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి.
మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాల శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది అన్నది భక్తుల నమ్మకం.
*లింగోద్భవం.*
మహా శివరాత్రి రోజున, నిషితా కాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం. లార్డ్ శివ లింగ రూపంలో భూమి మీద కనిపించిడంతో నిషితా కాలం జరుపుకుంటారు.
ఈ రోజున, అన్ని శివాలయాలు లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు.
ప్రళయ సవరించు వేళా.
మహా ప్రళయ కాలంలో సర్వ లోకాలు సముద్ర నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతి దేవి మహా ప్రళయ అనంతరం మళ్ళీ జీవులని, జీవ శక్తిని పెపొందించే నిమిత్తం తన భర్త శివుడు ప్రార్థించారు అని మరో కథనం.
శివుడి ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను నివసిస్తున్న ఆత్మలు రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలులో మైనపు ముద్దలతో ఉండిపోయేవిధంగా దేవత పార్వతి ప్రార్థించడం జరిగిందని తెలపడం జరుగుతుంది.
*శివునికి ఇష్టమైన రోజు శివరాత్రి.*
భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు, ఆచారాలు పాటించేవారు, పార్వతి దేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును కోరారు.
అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 రాత్రి, ఫాల్గున నెలలో కృష్ణ పక్షంలో, తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి, ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది. వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది. మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో టకుపడం జరిగింది.
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు చేరుకొని.సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం జరుగుతుంది.
పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం క్రమంలో సూర్యుని వలె ప్రకాశించే వినంలో సనత్కుమారుడు వెళ్ళుతున్న సమయంలో దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపండి అనడంతో మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు తెలపడం జరుగుతుంది.
సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని వివరించడం జరుగుతుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో నామస్మరణం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
శివరాత్రి ఉత్సవాలకు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర సంబంధించిన రాష్ట్రాల ప్రజలు పెద్ద మొత్తంలో కాలేశ్వరం చేరుకోవడం జరుగుతుంది. శుభరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు గోదావరి స్థానాలు గర్భ గుడి దర్శనం భక్తుల ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు పూర్తి స్థాయిగా ఏర్పాటు చేయడం జరిగింది.



