రాజీవ్ నగర్ ఇళ్ల జాబితాపై సెగ…అర్హులకు మొండిచేయి..?

శనివారం విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాపై స్థానిక దరఖాస్తుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న తమకు అన్యాయం జరిగిందని, అర్హత ఉన్నా జాబితాలో పేర్లు లేకపోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.

దరఖాస్తుదారుల వేడుకోలు…!

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ నగర్ ఇళ్ల (సింగిల్ బెడ్ రూమ్) లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది.

అధికారులు శనివారం విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాపై స్థానిక దరఖాస్తుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న తమకు అన్యాయం జరిగిందని, అర్హత ఉన్నా జాబితాలో పేర్లు లేకపోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.

 

*సింగిల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆగ్రహం*..!

 

జాబితాలో అనర్హులకు చోటు కల్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “సొంతంగా పొలాలు, ప్లాట్లు ఉన్నవారికి కూడా ఇళ్లు కేటాయించారు అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, రెక్కాడితే గానీ డొక్కాడని మా వంటి నిరుపేదలను పట్టించుకోలేదు” అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన కేవలం నామమాత్రంగానే జరిగిందని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అనర్హులను ఎంపిక చేశారని వారు ఆరోపిస్తున్నారు.

 

అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ…!

 

ఈ వివాదంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో ఉన్న ఆరోపణల నేపథ్యంలో జాబితాను పునఃసమీక్షించి అక్రమాలను అరికడతారా నిజమైన నిరుపేదలకు న్యాయం చేసేందుకు క్షేత్రస్థాయిలో మళ్లీ విచారణ చేపడతారా …అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

 

*దరఖాస్తుదారుల వేడుకోలు*..!

 

“కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి, అసలు నిలువ నీడ లేని వారికి ప్రాధాన్యత ఇవ్వాలి” అని బాధితులు వేడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని పారదర్శకమైన పద్ధతిలో ఇళ్ల కేటాయింపు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button