ఇసుక లారీల దౌర్జన్యం…కమలాపురం రైతుల ఆవేదన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం గ్రామంలో ఇసుక లారీల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

•డీఎస్పీ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ నరేష్ కు గ్రామస్తుల వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,మణుగూరు, ఫిబ్రవరి 17 (నిజం చెపుతాం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం గ్రామంలో ఇసుక లారీల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రోజున మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ నరేష్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు గ్రామం పక్కనుంచి వెళ్లడంతో భారీగా దుమ్ము ఎగిసిపడుతూ ఇళ్లపై పేరుకుపోతుందని తెలిపారు.

ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పంట పొలాలకు వెళ్లే రహదారిని పూర్తిగా ఇసుక లారీలు ఆక్రమించుకోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

గత నాలుగేళ్లుగా ఇసుక కాంట్రాక్టర్లు తమ లారీలతో రహదారిని పూర్తిగా ఆక్రమించుకుంటున్నారని, రాత్రింబగళ్లు లారీల రాకపోకలతో రహదారి గుంతలమయం అయి ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.

అదేవిధంగా కొందరు లారీ డ్రైవర్లు, క్లీనర్లు రహదారి పక్కనే మద్యం సేవించి ఖాళీ సీసాలను పొలాల్లో పగులగొడుతున్నారని, దీంతో రైతులు, కూలీలు గాజు పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుని గ్రామస్తులకు, రైతులకు న్యాయం చేయాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో రావులపల్లి రామమూర్తి, నర్రా దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు, ప్రసాద్, రఘు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button