రైతులకు తీపి కబురు..22న ‘రైతు భరోసా’ నిధుల విడుదల..!
ఈ నెల 22న (22-03-2026) సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి విడత నిధులను విడుదల చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న (22-03-2026) సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి విడత నిధులను విడుదల చేయనున్నారు.
తొలి విడత: ₹3,590 కోట్ల నిధులు (70 లక్షల మంది రైతులకు లబ్ధి).
రెండో విడత: మరో 20 రోజుల్లో ₹2,650 కోట్లు విడుదల.
మూడో విడత: ఏప్రిల్ చివరి నాటికి మిగిలిన నిధుల జమ. మొత్తం బడ్జెట్: ఈ సీజన్ కోసం ప్రభుత్వం సుమారు ₹9,000 కోట్లు కేటాయించింది.
వరుస విడతల్లో నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.



