రైతు భరోసా నిధులు విడుదల….రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి నగదు

బ్యాంకులకు ఆదివారం సెలవు కాబట్టి సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కావడంలో స్వల్ప ఆలస్యం ఉండవచ్చు

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను (మార్చి 22, ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తున్నారు.

 

బ్యాంకులకు ఆదివారం సెలవు కాబట్టి సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కావడంలో స్వల్ప ఆలస్యం ఉండవచ్చు.

 

మొదటి విడతలో భాగంగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

 

ఎప్పుడు జమ అవుతాయి? ఈరోజు ఆదివారం కావడంతో, రేపటి నుండి (మార్చి 23, సోమవారం) రైతుల ఖాతాల్లోకి నగదు నేరుగా (DBT ద్వారా) చేరే అవకాశం ఉంది.

 

రెండో విడత నిధులు ఏప్రిల్ 9 లేదా 10 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 

మూడో విడత నిధులు ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్

 

*rythubharosa.telangana.gov.in*

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button