విద్యాభివృద్ధికి రూ.1000 కోట్లతో ప్రభుత్వం కృషి
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ వంటి విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

నిరుద్యోగులకు సాబు ట్రస్ట్ ద్వారా ఉచిత గ్రూప్-1 పుస్తకాల పంపిణీ….
విద్యతో పాటు సంస్కారం అవసరం
వనపర్తి లో నూతనంగా బచ్ పన్ పాఠశాల ప్రారంభం
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో మార్చ్ 31 (నిజం చెపుతాం)
వనపర్తి పట్టణంలో నిరుద్యోగ యువతకు సాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా గ్రూప్-1 పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. గత మూడు సంవత్సరాలుగా తల్లిదండ్రుల పేరుతో నిరుద్యోగులకు సేవలు అందిస్తున్న ట్రస్ట్ కార్యకలాపాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభినందించారు.
మంగళవారం వనపర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన “బచ్పన్” పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా సంస్కారం, మానవతా విలువలు, తల్లిదండ్రులపై గౌరవం కలిగేలా విద్యాబోధన జరగాలని ఆయన సూచించారు.
విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా పాఠశాలలు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
వనపర్తి పట్టణం విద్యాపరంగా అభివృద్ధి చెందుతుండటం సంతోషకరమని, ప్రైవేట్ విద్యాసంస్థల ఏర్పాటు మంచి సూచన అని ఆయన అన్నారు.
సొంత ప్రాంతంపై ప్రేమతో సేవాభావంతో పాఠశాలను ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త ప్రజా సామాజికవేత మీరాశిపల్లి శ్రీనివాసులు, ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, గత 24 నెలల్లో కేవలం విద్యా వ్యవస్థ బలోపేతానికి రూ.1000 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ వంటి విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల గురించి ప్రస్తావిస్తూ, తల్లిదండ్రులను సరిగా చూసుకోని ఉద్యోగుల జీతాల నుంచి రూ.10 నుండి 15 వేల వరకు కట్ చేసి వారికి అందించే విధంగా చట్టం తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లా విద్యలో ప్రతిష్టంగా ఉందని ప్రవేటు పాఠశాలలు కూడా విద్యను నాణ్యవంతంగా అందిస్తున్నాయని జిల్లాను విద్యలో మొదటి స్థానానికి తీసుకురావాలని కలెక్టర్ అన్నారు,
గత మూడు సంవత్సరాలుగా సాబు ట్రస్టు వ్యవస్థాపకుడు సామాజికవేత శ్రీనివాస్ యాదవ్ నిరుద్యోగులకు వనపర్తి వాసులకు చేసిన సేవలు అభినందనీయమని వారి తల్లిదండ్రుల పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పలు ఉచిత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆయనను ఆయన కుటుంబ సభ్యులను అభినందిస్తున్నానని కలెక్టర్ అన్నారు,
ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్-1 పుస్తకాలను ఎమ్మెల్యే కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.



